గ్రంథాలయాలతో విజ్ఞాన సముపార్జన
డీవైఈవో సూర్య ప్రకాశం
అమలాపురం టౌన్: గ్రంథాలయాల ద్వారా సమాజంలో అన్ని తరగతుల ప్రజలు విజ్ఞాన సముపార్జన చేస్తారని అమలాపురం డీవైఈవో గుబ్బల సూర్య ప్రకాశం అన్నారు. అమలాపురంలోని ప్రధమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలను ఆయన గురువారం ప్రారంభించారు. గ్రంథాలయాధికారి జీవీఆర్‌ఎస్‌హెచ్‌కే వర్మ అధ్యక్షతన ప్రారంభమైన ఈ వారోత్సవాల ప్రారంభ సభలో తొలుత దేశ మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు, గ్రంథాలయ పాఠకులు అధిక సంఖ్యలో పాల్గొని వారోత్సవాలు నిర్వహించారు. డీవైఈవో సూర్య ప్రకాశం గ్రంథాలయాల విశిష్టత, సేవలపైనే కాకుండా నెహ్రూ దేశానికి అందించిన సేవలు, నేటి బాలలే రేపటి పౌరులు అనే అంశంపై ప్రసంగించి విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. మరో అతిథి స్థానిక మహాత్మా గాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బీఆర్ కామేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులకు నెహ్రూ జీవిత చరిత్రను వివరించారు. సరస్వతీ దేవి చిత్ర పటానికి పూజలు చేశారు. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజలు వ్యక్తిగతంగానే కాకుండా, మానసికాభివృద్ధి సాధిస్తారని వర్మ సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సహాయకులు పోలిశెట్టి సత్యనారాయణమూర్తి, ఆకుల భవాని తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment