ఎస్పీని కలిసిన మహాసేన రాజేష్
అమలాపురం టౌన్: జిల్లా ఎస్పీ బి.కృష్ణారావును మహాసేన రాజేష్, అతని అనుచరులు స్థానిక ఎస్పీ కార్యాలయంలో సోమవారం కలిశారు. మలికిపురం మండలం శంకరగుప్తానికి చెందిన ఓ మహిళ.. తన ఫొటోలను రాజేష్, అతని అనుచరులు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారన్న ఫిర్యాదుపై మలికిపురం పోలీసు స్టేషన్‌లో ఈ నెల 15న కేసు నమోదైన సంగతి తెలిసిందే. రాజేష్, అతని అనుచరులు ఎస్పీని కలిసి ఈ కేసు విషయమై మాట్లాడారు. తనపై నమోదైన కేసుపైన, తనను నిందితుడిగా చేర్చిన విషయాలపై ఎస్పీకి రాజేష్ వివరణ ఇచ్చుకున్నట్టు తెలిసింది.
అన్నదాన భవన నిర్మాణానికి రూ.50 వేల విరాళం
ఆత్రేయపురం: కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్మిస్తున్న వకుళమాత అన్నదాన భవనం నిర్మాణానికి రాజమహేంద్రవరానికి చెందిన మత్సటి శివ, సత్యవతి దంపతులు రూ.లక్ష విరాళం అందించినట్టు ఆలయ ఈఓ నల్లం సూర్య చక్రధర్ తెలిపారు. దాతకు ఆలయ సిబ్బంది స్వామి వారి చిత్రపటం అందజేశారు.
ప్రజా ఫిర్యాదులపరిష్కారానికి ప్రాధాన్యం
అమలాపురం రూరల్: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల ని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధికారులకు సూ చించారు. సోమవారం కలెక్టరేట్ గోదావరి భవన్‌లో జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమంలో ఆయన, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డీఆర్‌ఓ వి.మదనమోహనరావు, డీఆర్‌డీ ఏ పీడీ శివశంకర్ ప్రసాద్, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీ రాణి అర్జీదారుల నుంచి సుమారు 220 వినతులను స్వీకరించారు. అందుబాటులో ఉన్న అధికారుల ద్వారా పరిష్కార మార్గాలు చూపారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 24 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 24 అర్జీలు వచ్చా యి. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు అర్జీలు అందించి తమ సమస్యలను ఏకరువు పెట్టుకున్నారు. అర్జీదారులు ఇచ్చిన ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఎస్పీ కృష్ణారావు సంబంధిత పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్సైలను ఆదేశించారు. వచ్చిన అర్జీల్లో ఎక్కువగా కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలకు సంబంధించినవి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment