సమస్యలపై సమీక్ష
అమలాపురం రూరల్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పలు అంశాలపై చర్చలు జరిపారు. సోమవారం రాత్రి అమలాపురం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో వారు కలెక్టర్ మహేష్‌కుమార్‌తో సమావేశమయ్యారు. మంత్రితోపాటు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, మండపేట, అమలాపురం, కొత్తపేట, రాజోలు ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, అయితాబత్తుల ఆనందరావు, బండారు సత్యానందరావు, దేవ వరప్రసాద్ సమావేశమై తమ నియోజకవర్గాల్లో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష చేశారు. తాగునీటి సమస్య, రోడ్ల నిర్మాణం, విద్య, వైద్యం, నిరుద్యోగ నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్‌తో చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment