సమన్వయంతో సమస్యల పరిష్కారం
కలెక్టర్ మహేష్‌కుమార్ సూచన
అమలాపురం రూరల్: జిల్లా అధికారులు క్షేత్ర స్థాయిలో సమన్వయం చేసుకొని పటిష్ట పర్యవేక్షణతో అర్జీదారుల సమస్యలకు పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ గోదావరి భవన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని జిల్లా అధికారులతో నిర్వహించారు. కలెక్టర్ మహేష్‌కుమార్ డీఆర్‌డీఏ పీడీ శివశంకర్ ప్రసాద్, డ్వామా పీడీ ఎస్. మధుసూదన్, ఐసీడీఎస్ పీడీ ఎం.ఝాన్సీరాణి అర్జీదారుల నుంచి 191 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన హామీలు 28 పెండింగ్‌లోఉన్నాయని వీటిపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు.
పంటల బీమా పథకం రబీ 2024–25 కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఇన్సూరెన్స్ కంపెనీకి రైతులు ఎకరాకు రూ.630వేలు చొప్పున చెల్లించాలని ఈ పథకానికి గడువు ఈ నెలాఖరు వరకు ఉందని స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు తదితర కారణాల వల్ల పంటకు నష్టం వాటిల్లితే మండలం యూనిట్‌గా ఎకరాకు గరిష్టంగా రూ.42 వేల వరకు బీమా పరిహారంగా పొందవచ్చునన్నారు. ఆర్ డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కృష్ణారెడ్డి, సీపీవో వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బోసుబాబు, ట్రాన్స్‌కో ఎస్సీ ఎస్.రాజబాబు, ఎల్డీఎం కేశవవర్మ, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి పి.జ్యోతిలక్ష్మీదేవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం.దుర్గారావు దొర పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్‌న్స్‌కు 15 అర్జీలు
అమలాపురం టౌన్: ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 15 అర్జీలు వచ్చాయి. ఎస్పీ బి.కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చారు. అర్జీల్లో ఎక్కువ కుటుంబ తగాదాలు, ఆస్థి వివాదాలు ఉండగా ఆయా పోలీస్ స్టేషన్లకు ఎస్పీ ఫోన్ చేసి త్వరగా పరిష్కారించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment