ఆదర్శ మహిళ సావిత్రిబాయి ఫూలే
అమలాపురం టౌన్: తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రి బాయి ఫూలే సాంఘిక దురాచారాలపై నిరంతర పోరాటాలు చేసి ఆదర్శ మహిళగా నిలిచిపోయారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. ఇలాంటి ఆదర్శ మహిళ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఓ పండగలా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సావిత్రిబాయి పూలే 194వ జయంతిని పురస్కరించుకుని స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం ఆమె విగ్రహానికి ఎమ్మెల్సీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. సావిత్రి బాయి పూలే సిద్ధాంతాలకు అనుగుణంగానే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహిళలకు పెద్ద పీట వేసి చివరకు నామినేటెడ్ పదవుల్లో సైతం 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని ఆయన గుర్తు చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, మండల పరిషత్ అధ్యక్షురాలు కుడుపూడి భాగ్యలక్ష్మి, మహిళా మున్సిపల్ కౌన్సిలర్లు, మహిళా ఉపాధ్యాయుల పాల్గొన్నారు. మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా ఉపాధ్యాయులను నేతలు సత్కరించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎస్.రాజరాజేశ్వరి, విజయకుమారి, మున్సిపల్ కౌన్సిలర్లు కొల్లాటి దుర్గాబాయి, వాసర్ల లక్ష్మి, దొంగ నాగసుధారాణి, గండి హారిక తదితరులు ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment