మత్స్యకారులను ఆదుకుంటాం
– ఎమ్మెల్యే దాట్ల
తాళ్లరేవు: చమురు సంస్థల కార్యకలాపాల కారణంగా నష్టపోతున్న మత్స్యకారులను ఆదుకుంటామని ము మ్మిడివరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు తెలిపారు. శుక్రవారం కోరంగిలో జరిగిన ఓఎన్‌జీసీ నష్టపరిహార పంపిణీ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార, మత్స్యశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరై రూ.148.37 కోట్ల చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే దాట్ల మాట్లాడుతూ చమురు సంస్థల కార్యకలాపాల కారణంగా మత్స్యసంపదకు ముప్పు వాటిల్లి మత్స్యకారులు నష్టపోతున్నందున పరిహారం అందజేస్తున్నట్లు తెలిపారు. పుదుచ్చేరి అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ మత్స్యకారుల్లో ఉన్న 14 ఉపకులాలకు వారికి కూడా పరిహారం అందించాలని కోరారు. మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్ర, ఎంపీ గంటి హరీష్‌మాథుర్, యనమల రామకృష్ణుడు, చిక్కాల రామచంద్రరావు, నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, అయితాబత్తుల ఆనందరావు, బండారు సత్యానందరావు, వేగుళ్ల జోగేశ్వరరావు, జ్యోతుల నవీన్, రెడ్డి సుబ్రహ్మణ్యం, మత్స్యశాఖ కమిషనర్ టి.డోలా శంకర్, ఎంపీపీ రాయుడు సునీత, కోరంగి సర్పంచ్ పెయ్యల మంగేష్ పాల్గొన్నారు. కాగా కార్యక్రమంలో ప్రముఖులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై పలువురు చర్చించుకున్నారు. అయితే మంత్రి అచ్చెనాయుడు మాట్లాడుతుండగానే చాలామంది లేచివెళ్లిపోవడం కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment