విశ్వసనీయత పెంచేలా సమస్యలకు పరిష్కారం
అమలాపురం రూరల్: అర్జీదారులకు విశ్వసనీయత పెంచేలా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఇందులో జేసీ టి.నిషాంతి, డీఆర్డీఏ, డ్వామా ఐసీడీఎస్ పీడీలు శివశంకరప్రసాద్, మధుసూదన్, ఝాన్సీరాణిలు పాల్గొని ప్రజల నుంచి సుమారు 218 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక వెబ్ పోర్టల్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. మండల స్థాయిలో పరిష్కారమయ్యే అర్జీలను అక్కడే సమర్పించాలని అన్నారు. అర్జీని ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంఖ్య కేటాయిస్తారని, దాని ఆధారంగా ఫిర్యాదు ఏ దశ, స్థితిలో ఉందో తెలుసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. సార్వత్రిక ఫిర్యాదుల పరిష్కార హెల్ప్ లైన్ ద్వారా తమ సమస్యలను నేరుగా తెలియజేయడానికి వీలుందన్నారు. ఫిర్యాదుదారులు 1902కు ఫోన్ చేసి తమ ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు. సీపీఓ వెంకటేశ్వర్లు, డీఈఓ బోసుబాబు, పీఆర్ ఎస్‌ఈ పి.రామకృష్ణారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా, జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ ప్రసాద్, ఎల్‌డీ ఎం.కేశవవర్మ, డీసీహెచ్ ఎస్.కార్తీక్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ ఎం.దుర్గారావుదొర తదితరులు పాల్గొన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ
జిల్లా నీటి యాజమాన్య సంస్థకు చెందిన జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఉద్యోగుల రాష్ట్ర సంఘం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని కలెక్టర్ రావిలాల మహేష్ కుమార్ ఆవిష్కరించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకుడు ఎస్.మధుసూదన్, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంక్షేమ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు వి.రాజామణి, సాధారణ కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు, కోశాధికారి జి.రవీంద్రబాబు, రాష్ట్ర సాధారణ కార్యదర్శి ఎం.త్రినాథ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment