అమలాపురం రూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంగళవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీకోనసీమ క్రీడోత్సవం.. ఆటలతో ఆరోగ్యంశ్రీ పేరిట మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పిల్లల్లో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ఈ వినూత్న కార్యక్రమం చేపట్టామన్నారు. 4 ,5, 6 తరగతుల విద్యార్థులకు అథ్లెటిక్స్ పోటీలు, 7, 8 ,9 తరగతుల విద్యార్థులకు అథ్లెటిక్స్‌తో పాటు బ్యాడ్మింటన్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని 22 మండల కేంద్రాల్లో ఈ ఆటల పోటీలు జరుగుతాయన్నారు. మండల విజేతలైన 7, 8, 9 తరగతుల విద్యార్థులకు ఈ నెల 22, 23, 24 తేదీల్లో అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో జిల్లా స్థాయి పోటీలను ఉంటాయన్నారు. దీనికి ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంఈఓలు, పాఠశాల క్రీడల ఫెడరేషన్ కార్యదర్శులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment