ప్రత్యేకత చాటిన పులస ప్రాజెక్ట్
నేషనల్ చిల్ట్రన్స్ సైన్స్ కాంగ్రెస్‌లో గుర్తింపు
అమలాపురం టౌన్: మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లో జరిగిన 31వ నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ జాతీయ స్థాయి పోటీల్లో జిల్లాకు గుర్తింపు లభించింది. వివిధ రాష్ట్రాల నుంచి 500 ప్రాజెక్ట్‌లు రాగా, 20 ప్రాజెక్ట్‌లు మాత్రమే ఎంపికై అందులో జిల్లాకు చెందిన పులస చేపల పరిరక్షణకు సంబంధించిన ప్రాజెక్ట్ గుర్తింపు తెచ్చుకోవడం గర్వకారణమని జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం అన్నారు. జిల్లాకు సంబంధించి శ్రీఎకోసిస్టమ్ బేస్డ్ అప్రోచ్‌శ్రీ (ఈబీఏ) ఫర్ సెల్ఫ్ రిలయన్స్ అనే ఉప అంశంతో.. పులస శీర్షికతో శ్రీడోంట్ లెట్ అవర్ గెస్ట్ డిసప్పయర్‌శ్రీ పేరుతో ప్రాజెక్ట్ జాతీయ స్థాయిలో ప్రదర్శిమతమైంది. అమలాపురం రూరల్ మండలం సమనస ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు జి.చైతన్య దీపిక (గ్రూప్ లీడర్), ఎస్.రిషిమా (గ్రూప్ మెంబర్), గైడ్ టీచర్ డి.సుభాషిణి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్‌ను ప్రదర్శించారు. ఆచరణలో ఉన్న నైపుణ్యంతో పులసలను పరిరక్షించుకునే విధానంపై విద్యార్థులు చేసిన ప్రయత్నం ప్రశంసనీయమని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. జిల్లాను జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక స్థాయికి తీసుకు వెళ్లిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని, విద్యార్థులు, ఉపాధ్యాయులను డీఈఓ షేక్ సలీమ్ బాషా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment