పోలీస్ గ్రీవెన్స్‌కు 19 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 19 అర్జీలు వచ్చాయి. ఎస్పీ బి.కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి తమ సమస్యలను చెప్పుకొన్నారు. వచ్చిన ప్రతి అర్జీని క్షణ్ణంగా పరిశీలించిన ఎస్పీ వాటి పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్సైలకు పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. వచ్చిన అర్జీల్లో ఎక్కువ ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల ఫిర్యాదులు ఉండడంతో అందులో కొంత మందికి దాదాపు కౌన్సెలింగ్ ఇచ్చి పరిష్కారానికి ప్రయత్నించారు.
విదేశాల్లో ఉపాధి పేరుతో మోసం
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ పెట్టి రూ.వేలల్లో డబ్బులు కాజేసి విదేశాలకు పంపి నానా యాతనలకు గురి చేస్తున్న నకిలీ ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని పి.గన్నవరం మండలం నరేంద్రపురానికి చెందిన గుబ్బల వీరరాఘవులు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో జరిగిన గ్రీవెన్స్‌లో ఆయన నకిలీ ఏజెంట్ వల్ల తన భార్య కుమారి బెహ్రైన్ దేశంలో ఎన్ని ఇబ్బందులు పడుతుందో వివరించాడు. కాకినాడకు చెందిన తల్లీ కొడుకులు, రామచంద్రపురానికి చెందిన ఒక వ్యక్తి నకిలీ ఏజెంట్లుగా తన భార్యను బెహ్రైన్ దేశం ఉపాధి నిమిత్తం పంపించి అక్కడ సరైన చోట, సరైన ఉద్యోగం చూపక నానా ఇబ్బందులు పడేలా చేశారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment