హెచ్‌ఎంపీవీపై భయాందోళన వద్దు
కాకినాడ రూరల్: హ్యూమన్ మెటా న్యూమో వైరస్(హెచ్‌ఎంపీవీ)పై మీడియాలో అనవసర భయాందోళనలు సృష్టించడం తగదని, ఇది దశాబ్దాలుగా తెలి సిన జలుబు వైరస్ మాత్రమేనని నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడు రామకృష్ణ తెలిపారు. కరోనా వి ధ్వంసం నుంచి ఇంకా తేరుకోని ప్రజలు.. చైనాలో మరో వైరస్ వ్యాప్తి చెందుతోందనే ప్రచారంపై ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో మంగళవారం ఆ యన సాక్షితో మాట్లాడారు. ఇన్‌ఫ్లూయెంజా (ఫ్లూ) వంటి వైరస్ కంటే హెచ్‌ఎంపీవీ చాలా తక్కువ ప్రమాదకరమని చెప్పారు. చిన్న పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తగ్గిన వ్యక్తుల్లో ఈ వైరస్ అనారోగ్యం కలిగిస్తుందన్నారు. వైరస్ బారిన పడకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవడంతో పాటు దగ్గుతో బాధ పడుతున్న వారికి దూరంగా ఉండాలని సూచించారు. రోగ నిరోధ క శక్తి పెరుగుదలకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, అవసరమైతే వైద్యులను సంప్రదించాలని చెప్పారు. దగ్గుతో బాధ పడేవారు వారం పది రోజుల్లో కోలుకుంటారని డాక్టర్ రామకృష్ణ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment