వ్యాయామ ఉపాధ్యాయుడు ముసలయ్యకు సన్మానం
అల్లవరం: సుదీర్ఘకాలంగా వ్యాయామ ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తూ ఎంతోమంది విద్యార్థులను జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దిన ఫిజికల్ డైరెక్టర్ యూఎస్‌వీ ముసలయ్య నేటి పీఈటీలకు ఆదర్శప్రాయుడని జిల్లా క్రీడల అధికారి సురేష్ అన్నారు. కొమరగిరిపట్నం ఉన్నత పాఠశాలలో మంగళవారం ప్రారంభమైన కోనసీమ క్రీడోత్సవాలను పురస్కరించుకుని 38 సంవత్సరాల పాటు వ్యాయామ ఉపాధ్యాయులు గా విధులు నిర్వర్తించిన ముసలయ్యకు మంగళవా రం సన్మానం చేశారు. ఎంపీపీ శేషగిరిరావు మాట్లాడుతూ కోడూరుపాడు ఉన్నత పాఠశాలలో పీడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ముసలయ్య ఎన్నో క్రీడా పోటీలను అలవోకగా నిర్వహించి మండలానికి మంచి పేరు తీసుకొచ్చారన్నారు. మండల ప్రత్యేకాధికారి కర్నిడీ మూర్తి, జెడ్పీటీసీ సభ్యురాలు కొను కు గౌతమి, ఎంపీటీసీ సభ్యుడు కృష్ణమోహన్, తహసీల్దార్ వీవీఎల్ నరసింహారావు, హెచ్‌ఎం రమణ, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment