అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
● ఆకట్టుకున్న ఫ్యాషన్ షో, బాడీ బిల్డింగ్ ప్రదర్శనలు
● రెండో రోజు ప్రజాఉత్సవాలు
యానాం: యానాం ప్రజాఉత్సవాలలో భాగంగా రెండోరోజు మంగళవారం స్ధానిక బాలయోగి స్టేడియంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా మిస్ ఫెమినా కంటెస్టెంట్ డిజైనర్స్ నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. వివిధ రకాల డ్రెస్‌లతో వేదికపై నిర్వహించిన ఫ్యాషన్‌షోలో కోల్‌కతా తదితర ప్రాంతాలకు చెందిన ఫెమినా డిజైనర్స్ పాల్గొన్నారు. అనంతరం సోనీ టెలివిజన్ షోలో విజేతలుగా నిలిచిన టీనేజర్స్ క్రూ టీమ్ తమ విభిన్న రీతుల్లో చేసిన నృత్యాలు, ఇండియా గాట్ టాలెంట్ విన్నర్స్ టీనేజర్స్ క్రూ టీమ్‌ల నృత్యాలు ఆకట్టుకున్నాయి. అంతర్జాతీయ స్ధాయిలో రష్యన్ యువతులు ప్రదర్శించిన డ్యాన్స్, ఇండియన్ మైండ్ రీడింగ్ ఆర్టిస్ట్ సుదర్శన్ ప్రదర్శన ఆహుతులను అలరించింది. అనంతరం బాడీబిల్డింగ్ షోలో పలువురు యువకులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. తెలుగు సంప్రదాయ పండుగల ఈవెంట్‌లు, స్థానిక యువకుల పాశ్చాత్యశైలి నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment