త్వరలో బకాయిల చెల్లింపు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను త్వరలో ప్రభుత్వం చెల్లిస్తుందని ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. కాకినాడలో యూటీఫ్ స్వర్ణోత్సవాలు నాలుగో రోజు రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగాయి. జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ మాట్లాడుతూ యూటీఎఫ్ నిబద్ధతతో పనిచేసే ఒక్కటి ఉపాధ్యాయ సంఘమని అభినందించారు. పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వీబీ తిరుపాణ్యం మాట్లాడుతూ కళాశాల ప్రాసస్త్యాన్ని వివరించారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిల కోసం యూటీఎఫ్ కార్యచరణ ప్రణాళిక రూపొందించిందన్నారు. ఫిబ్రవరి 17 నుంచి కార్యక్రమాలు మొదలు పెడతామన్నారు. దీనికోసం ఫిబ్రవరి 2న విజయవాడలో సన్నాహక సదస్సు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తర్వాత ఉత్తరాంధ్ర, గోదావరి, ఉత్తర రాయలసీమ, దక్షిణ రాయలసీమల్లో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి జి.గిరిధర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం, సాంకేతిక స్పృహను పెంపొందించాలన్నారు. అనంతరం రాష్ట్రంలో 26 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో జిల్లాల వారీగా విశ్లేషణ జరిపి పలు తీర్మానాలు ఆమోదించారు. కాకినాడ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.నగేష్, టి చక్రవర్తి, ఐ.ప్రసాదరావు, చిలుకూరు శ్రీనివాసరావు పాల్గొన్నారు.
రాష్ట్ర కమిటీ ఎన్నిక
యూటీఎఫ్ రాష్ట్ర నూతన కమిటీని ఎన్నికల అధికారి జి .ప్రభాకర్‌వర్మ ఏకగ్రీవంగా ప్రకటించారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా కె.శ్రీనివాసరావు, అధ్యక్షుడిగా ఎన్.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా కె.సురేష్ కుమార్, ఏఎన్ కుసుమ కుమారి, ప్రధాన కార్యదర్శిగా కేఎస్‌ఎస్ ప్రసాద్, కోశాధికారిగా ఆర్.మోహన్ రావు, 15 మంది రాష్ట్ర కార్యదర్శులు ఎన్నికయ్యారు. ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా టీఎస్‌ఎన్‌ఎల్ మల్లేశ్వరరావు, ఐక్య ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులుగా కె.సురేష్ కుమార్, ప్రచురణల కమిటీ చైర్మన్‌గా ఎం.హనుమంతరావు, కుటుంబ సంక్షేమ పథకం అధ్యక్షుడిగా కె.శ్రీనివాసరావు, అధ్యయన కమిటీ అధ్యక్షుడిగా పి.బాబు రెడ్డితో పలు సబ్ కమిటీలు ఏర్పాటు చేశారు.
తీర్మానాలు
సీపీఎస్ రద్దు, 117 జీవో రద్దు, ప్రాథమిక పాఠశాల వ్యవస్థ, 1 నుండి 5 వరకూ తరగతులు పునరుద్ధరణ, హైస్కూల్లో తెలుగు, ఇంగ్లిష్ మీడియం కొనసాగింపు, ఆర్థిక బకాయిలు చెల్లింపు, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, 12వ నూతన వేతన సవరణ సంఘం నియమించడం, ఖాళీ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ, యాప్స్ భారం తగ్గించడం తదితర తీర్మానాలు చేశారు. .
ఎంపీ ఉదయ్ శ్రీనివాస్
ఉత్సాహంగా యూటీఎఫ్ స్వర్ణోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment