ఫిట్స్‌తో వ్యవసాయ కూలీ మృతి
నల్లజర్ల: కవులూరు బస్టాప్ సమీపంలో బుధవారం ఉదయం ఒక వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అతడి వద్ద విజయవాడ నుంచి నల్లజర్ల వరకు వచ్చిన బస్ టికెట్ మాత్రమే ఉంది. దీంతో పరిసర గ్రామస్తులను విచారణ చేయగా అతడు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లు గ్రామానికి చెందిన కట్టపోగు సుబ్బారావు(57)గా గుర్తించారు. పోతవరంలో పొగాకు బ్యారను పనుల కోసం వస్తుండగా ఫిట్స్ వచ్చి మృతి చెందినట్టుగా భావిస్తున్నారు. మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment