పుదుచ్చేరి సర్వతోముఖాభివృద్ధికి కృషి
యానాం: పుదుచ్చేరి సర్వతోముఖాభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ కె.కై లాషనాథన్ అన్నారు. యానాంలో జరుగుతున్న ప్రజా ఉత్సవాలు, ఫల, పుష్ప ప్రదర్శన బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఎల్జీ మాట్లాడుతూ సంక్రాంతికి ముందే పండుగ వాతావరణం యానాంలో కన్పిస్తోందన్నారు. అంతకు ముందు ఆయనను ఘనంగా సత్కరించారు. కాగా..యానాం నియోజకవర్గ పరిధిలోని పలు ప్రధాన సమస్యలను ఎల్జీ కై లాషనాథన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. ప్రజా ఉత్సవాల వేదికపై ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల వేట నష్టపరిహారం అర్హులైన వారికి అందేలా తాను చర్యలు తీసుకున్నానన్నారు. రహదారి విస్తరణ, పలు శాఖల్లో ఉద్యోగుల పర్మినెంట్ తదితర వాటిని ఎల్జీకి వివరించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment