ఇసుక తవ్వకాలకు అనుమతులివ్వాలి
అమలాపురం రూరల్: జిల్లా వ్యాప్తంగా పట్టా భూములలో ఉన్న ఇసుక తవ్వకాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ కమిటీ సభ్యులను ఆదేశించారు. ఆయన అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌లలో తవ్వకాలను సాధ్యమైనంత ఎక్కువగా నిర్వహించాలన్నారు. వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయాలన్నారు. కొత్తగా ఏజెన్సీలు నియమించిన మూడు రీచ్‌లలో వారం రోజులలో ఇసుక తవ్వకాలు ప్రారంభించాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నిశాంతి, ఆర్డీవోలు శ్రీకర్, కె.మాధవి, డి.అఖిల, జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారి ఎల్.వంశీధర్ రెడ్డి, రియాల్టీ ఇన్‌స్పెక్టర్ టి.సుజాత, జీఎస్‌డబ్ల్యూఎస్ కో ఆర్డినేటర్ సువిజయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment