ఆలయంలో తాచుపాము
కొత్తపేట: ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలోని శివకేశవ ఆలయాల మధ్యలో ఉన్న కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర పుత్ర శక్తి గణపతి ఆలయంలో ఒక గోధుమతాచు హల్‌చల్ చేసింది. రెండు రోజులైన ఆలయం నుంచి బయటకు వెళ్లలేదు. దీంతో రాజమహేంద్రవరానికి చెందిన స్నేక్ క్యాచర్ మాధవ్‌కు ఆలయ కమిటీ సమాచారం అందించారు. ఆయన సుమారు రెండు గంటల ప్రయత్నించి మంగళవారం రాత్రి 11 గంటలకు పామును పట్టుకున్నారు. అనంతరం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారని ఆలయ కమిటీ చైర్మన్ చింతా సూర్యచంద్రరావు తెలిపారు.
జేఎన్‌టీయూకే వీసీ ఎంపికకు
సెర్చ్ కమిటీ నియామకం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్‌టీయూకే వీసీ నియామకానికి ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీని బుధవారం ఉన్నత విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించే సభ్యునిగా నన్నయ్య వర్సిటీ మాజీ వీసీ కే.నిరూపరాణి, పాలక మండలి తరఫున జేఎన్‌టీయూహెచ్ మాజీ వీసీ ప్రొఫెసర్ డీఎన్ రెడ్డి, యూజీసీ తరఫున ప్రొఫెసర్ వీజీనాధన్ కామకోటిని నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. వీరు ముగ్గురు జేఎన్‌టీయూ కాకినాడ వర్సిటీ వీసీ పదవి కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారి పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment