ఫలానా వారి కుమార్తెలు 30 లక్షల మంది | Sakshi
Sakshi News home page

ఫలానా వారి కుమార్తెలు 30 లక్షల మంది

Published Tue, May 7 2024 11:50 AM

-

రాయవరం: ఓటరు నమోదు సమయంలో ఓటరు వివరాలను నమోదు అధికారికి అందించాలి. అయితే 1951లో తొలిసారిగా ఓటరు నమోదు చేపట్టినపుడు తమ వివరాలు పూర్తి స్థాయిలో అందించేందుకు పలువురు నిరాకరించారు. అలా ఒకరు ఇద్దరు కాదు.. 30 లక్షల మంది. అప్పట్లో ఉన్న ఆచార సంప్రదాయాల ప్రకారం తమ పేరుతో భర్త పేరును చెప్పేందుకు నిరాకరించారు. కొందరు తండ్రి పేరు మాత్రమే చెప్పడంతో ఎన్నికల సిబ్బంది విధిలేని పరిస్థితుల్లో మహిళా ఓటర్ల పేర్లను ఫలానా వారి కుమార్తెగా ఓటర్ల జాబితాలో వివరాలుగా నమోదు చేసుకున్నారు. ఓట ర్ల పేరు లేకుండా కేవలం తండ్రుల పేరుతో దేశంలో ఈ విధంగా 30 లక్షల మంది వరకు ఓటర్ల జాబితాలో నమోదు చేశారు. ఈ జాబితాలను పరిశీలించిన ఎన్నికల సంఘం పేరు, భర్త పేరు లేకుండా కేవలం ఫలానా వారి కుమార్తె అని నమోదు చేసిన ఓటర్లందరినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించడంతో ఓటు హక్కును కోల్పోవాల్సి వచ్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement