కబడ్డీ క్రీడాకారుల ఎంపికలో పక్షపాతం
ఉమ్మడి జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యుల ఆవేదన
సామర్లకోట: యూనివర్సిటీ రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టులో క్రీడాకారుల ఎంపిక పక్షపాతంగా జరిగిందని ఉమ్మడి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు. బుధవారం స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు విలేకర్ల సమావేశంలో జట్టు ఎంపికపై విమర్శలు చేశారు. ఇటీవల మండపేటలో జరిగిన ఎంపికల్లో ఆదికవి నన్నయ యూనివర్సిటీకి చెందిన టీమ్‌లో అత్యంత ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను పక్కన పెట్టారని కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కొండపల్లి శ్రీను, ఉపాధ్యక్షుడు కిరణ్, సహాయ కార్యదర్శి సరోజ్ వాసులు ఆరోపించారు. జట్టులో నన్నయ యూనివర్సిటీకి చెందిన క్రీడాకారుడు వెంకట్ 50 పాయింట్లకు 40 పాయింట్లు తీసుకు వచ్చినా అన్యాయం జరిగిందన్నారు. సెలక్షన్ కమిటీలో సభ్యులుగా ఉన్న నరసింహరాజు, మూర్తి, ప్రభాకర్‌లకు కబడ్డీలో ఎటువంటి అనుభవం లేదన్నారు. ఠాగూర్, అనిల్ డిఫెన్స్‌లో ప్రతిభ కనబర్చారని తెలిపారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులను పట్టించుకోక పోతే వారికి గుర్తింపు ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు. సెలక్షన్ కమిటీలు సక్రమంగా లేకపోతే రాష్ట్రం, దేశంలోనే క్రీడాకారులు కనుమరుగై పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. యూనివర్సిటీకి చెందిన కబడ్డీ క్రీడాకారులకు న్యాయం చేయాలని నన్నయ యూనివర్సిటీ వైస్ చాన్సిలర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశామని, ఇప్పటి వరకూ న్యాయం జరగలేదన్నారు. క్రీడాకారులైన వెంకట్, ఠాగూరు, అనిల్‌లు తమకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. యూనివర్సిటీలో ఇదే తమకు చివరి అవకాశమని వారు అన్నారు. క్రీడాకారుల ప్రతిభను గుర్తించాల్సిన సెలక్షన్ కమిటీ తప్పుదారి పట్టడంపై పలువురు విమర్శించారు. ఇప్పటికై నా ప్రతిభ కలిగిన క్రీడాకారులకు గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment