భర్తపై వేడి నూనె పోసిన భార్య | - | Sakshi
Sakshi News home page

భర్తపై వేడి నూనె పోసిన భార్య

Published Thu, Oct 31 2024 2:30 AM | Last Updated on Thu, Oct 31 2024 2:30 AM

భర్తపై వేడి నూనె పోసిన భార్య

భర్తపై వేడి నూనె పోసిన భార్య

అన్నవరం: భర్తపై వేడి నూనె పోయడంతో అతను తీవ్రంగా గాయపడి తుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అన్నవరం ఎస్‌ఐ శ్రీహరిబాబు కథనం ప్రకారం.. పల్నాడు జిల్లా నకిరేకల్లుకు చెందిన మేకల సాయికుమార్‌, మండపం గ్రామ శివారు కొండ గైరంపేట చెందిన చాగంటి రాజ్యలక్ష్మికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. వీరు అన్నవరంలోని వెలంపేటలో నివాసం ఉంటున్నారు. రాజ్యలక్ష్మి ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. కాగా, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు అవుతుండడంతో సాయికుమార్‌ తన స్వగ్రామం వెళ్లిపోయాడు. అయితే భార్య అక్కడకు వెళ్లి కాపురానికి రాకపోతే పిల్లలను ఇక్కడే వదిలేస్తానని బెదిరించడంతో తిరిగి అన్నవరం వచ్చినట్లు సాయికుమార్‌ చెప్పాడని ఎస్‌ఐ తెలిపారు. మంగళవారం రాత్రి సాయికుమార్‌ ఇంటికి రాగా ఇంత ఆలస్యం ఎందుకు అయ్యిందని రాజ్యలక్ష్మి ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ పెరగడంతో పొయ్యి మీద పెనంలో గల వేడి నూనెను సాయికుమార్‌పై ఆమె పోసింది. దీంతో అతని వీపు మీద చర్మం కాలి బొబ్బలెక్కడంతో హుటాహుటిన తుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్త సాయికుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీహరిబాబు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement