వెస్ట్ జోన్ ప్రీ రిపబ్లిక్ డే పరేడ్‌కు గైట్ విద్యా
రాజానగరం: జాతీయ సేవా పథం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో నవంబర్ 12 నుంచి 21 వరకు జరిగే ప్రీ రిపబ్లిక్ డే పరేడ్‌కు ఆంధ్రా యూనివర్సిటీ తరఫున గైట్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ ఫర్జానా ఆష్మీ మొహ్మద్ ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎండి ధనరాజ్ తెలిపారు. కేబీసీ నార్త్ మహారాష్ట్ర యూనివర్సిటీ(జలగావ్)లో జాతీయ స్థాయిలో ఈ పరేడ్ జరగనుంది. ఈ సందర్భంగా ఆ విద్యార్థినిని ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్‌పీఓ షేక్ మీరా అభినందించారు.
220 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): బ్యాంకు గ్యారంటీ చెల్లించిన మిల్లులకు ధాన్యం కొనుగోలు ప్రక్రియను అనుసంధానం చేయాలని కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో ఖరీఫ్ 2024– 25 సంవత్సరంలో ధాన్యం సేకరణ పై జాయింట్ కలెక్టర్ చిన్న రాముడుతో కలసి సమన్వయ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను అందిస్తామన్నారు. జిల్లాలో 220 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించామన్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని రైతుల నుంచి 2 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ప్రాథమిక లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. ఇప్పటివరకు 350 మంది రైతుల నుంచి 2,733 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇందులో భాగంగా 213 మంది రైతులకు 253 ధాన్యం కొనుగోలు కూపన్లకు సంబంధించి రూ.4.25 కోట్లు జమ చేశామన్నారు. జిల్లాలో 117 కష్టమైజడ్ రైస్ మిల్లులను ధాన్యం కొనుగోలు ప్రక్రియకు అనుసంధానం చేశామన్నారు. బ్యాంక్ గ్యారంటీ చెల్లించని రైసుమిల్లలకు ధాన్యాన్ని పంపబోమన్నారు.
సమాచారం సేకరించాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయడంలో భాగంగా ఇప్పటి వరకూ సుమారు 20 వేల మందికి చెందిన డేటా ధ్రువీకరించామని, మిగిలిన వినియోగదారుల సమాచారం సేకరించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఎస్‌ఓ జేవీఎస్ ప్రసాద్, గ్యాస్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జేసీ ఏజెన్సీ డీలర్లతో మాట్లాడుతూ అర్హత కలిగిన వినియోగదారులను గుర్తించి అవసరమైన డాక్యుమెంట్లను పొందాలన్నారు. జిల్లాలో 1,62,000 మంది లబ్ధిదారులకు రూ.42.45 కోట్ల మేర ప్రయోజనం చేకూరనున్నదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment