దీపావళి కావాలి ఆనంద కేళి | - | Sakshi
Sakshi News home page

దీపావళి కావాలి ఆనంద కేళి

Published Thu, Oct 31 2024 2:30 AM | Last Updated on Thu, Oct 31 2024 2:31 AM

దీపావ

దీపావళి కావాలి ఆనంద కేళి

దుకాణాల వద్ద అగ్నిమాపక అవుట్‌ పోస్టులు

బాధ్యతాయుతంగా ఉండాలి

టపాసులు అమ్మేవారందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.అగ్ని నిరోధక పరికరాల్లో కనీసం ఒకటైనా అందుబాటులో ఉంచాలి. ఇసుక, నీటిని తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. ఇళ్లల్లో టపాసులు కాల్చేటప్పుడు మహిళలు, యువతులు, చిన్నారులు కాటన్‌ దుస్తులు ధరించాలి. టపాసులు కాల్చేటప్పుడు నీటిని అందుబాటులో ఉంచాలి. ఆనందోత్సవాల మధ్య దీపావళి పండగ నిర్వహించుకోవాలి.

– మార్టిని లూథర్‌కింగ్‌,

జిల్లా అగ్నిమాపక అధికారి, తూర్పుగోదావరి

బాణసంచా షాపుల వద్ద సందడి

రాజమహేంద్రవరం రూరల్‌: దీపావళి అంటేనే వెలుగుల పండగ, అమావాస్య చీకట్లను చీల్చుతూ ఎటు చూసినా దీపాల సొబగులే. అంబరాన్నంటే సంబరాలే. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హిందువులంతా ఎంతో ఆనందోత్సవాలతో చేసుకునే పండగతో ప్రతీ ఇల్లు కళకళలాడుతుంది అయితే ఈ ప్రమోదం వెనుకే ప్రమాదం పొంచి ఉందన్న విషయం చాలామంది గుర్తెరుగరు. బాణసంచా కాల్చేటప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చూపినా పెను ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. అవి మిగిల్చిన చేదు జ్ఞాపకాలు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. దీపావళి పండగను జరుపుకునేందుకు జిల్లా సిద్ధమైంది. దీపావళి అంటే ప్రతీ మదిలో మెదిలేది టపాసులు, క్రాకర్స్‌, చిచ్చుబుడ్డి వెలుగులు. గతంలో పిండివంటలు చేసుకుని..మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించుకొని, దివిటీలు తిప్పుతూ పండగ జరుపుకునేవారు. ఇవి ప్రకృతికి పెద్దగా నష్టం కలిగించేవి కాదు. నేటి మన జీవన విధానం...పండగ చేసుకునే తీరు... ప్రకృతి వనరులు, చిన్నారులు, వృద్ధులు, శ్యాసకోశ వ్యాధిగ్రస్తులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నో జాగ్రత్తలతో పండగ జరుపుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వాయు కాలుష్యం హృదయ, శ్వాసకోశ వ్యాధులను తీవ్రతరం చేస్తుంది. గుండె, ఊపిరితిత్తులపై ప్రభావితం చూపుతుంది. గుండెపోటుకు దారి తీసే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా దీపావళి రోజు మాస్క్‌లు ధరించి టపాసులు కాల్చాలని వైద్యులు సూచిస్తున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొన్న కొన్ని సంస్థలు యాంటీ పొల్యూషన్‌ మాస్క్‌లను విరివిగా విక్రయిస్తున్నాయి. బాణసంచా దుకాణాల్లో ఇవి లభిస్తున్నాయి.

అత్యవసర నంబర్లు

108: అగ్నిప్రమాదంలో ఎవరైనా గాయపడితే వెంటనే 108కు ఫోన్‌చేయాలి. ప్రమాదం ఎక్కడ జరిగిందో లోకేషన్‌ వివరాలు స్పష్టంగా తెలియజేయాలి.

101 : అగ్నిప్రమాదం జరిగితే అగ్నిమాపకశాఖ కార్యాలయానికి సమాచారం అందించాలి.

100 : అత్యవసర సమాచారం ఏదైనా 100కు ఫోన్‌ చేసి తెలియజేయాలి.

అగ్నిమాపక కేంద్రాలు,

అధికారుల ఫోన్‌ నంబర్లు...

రాజమహేంద్రవరం : పి.శ్రీనివాస్‌ ఏడీఎఫ్‌వో (అసిస్టెంట్‌ డిస్ట్రిక్‌ ఫైర్‌ ఆఫీసర్‌) 0883–2444101 9963727248

అనపర్తి : జే.శ్రీనివాసరెడ్డి ఎస్‌ఎఫ్‌వో (స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌) 08857–227201 9963728023

నిడదవోలు : కె.శ్రీనివాసరావు ఏడీఎఫ్‌వో 08813–221101 9963726317

కొవ్వూరు : ఏవిఎస్‌ఎన్‌ఎస్‌ వేణు ఎస్‌ఎఫ్‌వో 08813–231101 9963726417

కోరుకొండ : పి.శ్రీనివాస్‌(ఇన్‌చార్జి), ఏడీఎఫ్‌వో 0883–2496101 9963727248

రాజమహేంద్రవరం నగరంలో జనం రద్దీని దృష్టిలో ఉంచుకుని అగ్నిమాపకశాఖ అధికారులు బాణసంచా దుకాణాల వద్ద అగ్నిమాపక అవుట్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. ఆర్ట్సుకళాశాల మైదానంలో ఫైర్‌ఇంజన్‌లు, పది షాపులకు మించి ఉన్న ప్రదేశాలలో ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్లు ఏర్పాటు చేశారు. పెద్ద దుకాణాల వద్ద ఇద్దరు ఫైర్‌మెన్‌లతో ఒక అగ్నిమాపక అవుట్‌ పోస్టును ఏర్పాటు చేశారు.

వీరు బాణసంచా దుకాణాల వద్ద, సమీప ప్రాంతాల్లో ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే వెంటనే స్పందిస్తారు.

వర్షం రాకతో వెలవెలబోతున్న దుకాణాలు

బుధవారం మధ్యాహ్నం సమయంలో వర్షం పడడంతో బాణసంచా దుకాణాలన్నీ కొనుగోలు చేసేవారు రాకపోవడంతో వెలవెలబోతున్నాయి. వేలాది రూపాయలు చెల్లించి లైసెన్సులు పొందడంతో పాటు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి దుకాణాలు ఏర్పాటు చేస్తే కనీసం పెట్టుబడి అయినా వస్తుందన్న అనుమానం వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది. కొనుగోళ్లు దీపావళి రోజైన గురువారం స్పీడు అందుకుంటాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీపావళి పండగ నెలాఖరు రావడం కూడా ప్రజల వద్ద సొమ్ము లేకపోవడం ఒక కారణంగా వ్యాపారులు అంటున్నారు.

బాణసంచా కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వినియోగదారులు నాణ్యమైన పటాసులు మాత్రమే కొనుగోలు చేయాలి

పైకి ఎగిరే తారాజువ్వలను గడ్డికుప్పలు,

పూరిగుడిసెలకు దూరంగా కాల్చాలి.

కాల్చేటప్పుడు చెప్పులు, బూట్లు ధరించాలి.

పెద్దల పర్యవేక్షణలో

పిల్లలు బాణసంచా కాల్చడం ఉత్తమం.

సరిగ్గా కాలని వాటిని మళ్లీ

వెలిగించడం, ఊదడం చేయకూడదు.

తక్కువ శబ్దం వచ్చే వాటిని ఎంచుకోవాలి.

పేలుడు పదార్థాలను పిల్లలకు దూరంగా ఉంచాలి.

కాల్చేటప్పుడు నీటిని అందుబాటులో ఉంచుకోవాలి. చేతిలో టపాసులు కాల్చడం, వెలిగించి విసిరి వేయడం వంటివి చేయకూడదు.

ఇంటిలోపల బాణసంచా కాల్చరాదు.

సెర్చిలైట్లు, చిచ్చుబుడ్లను చేతితో పట్టుకుని కాల్చవద్దు. వాటిని పట్టుకుని కాల్చడం వల్ల చాలామందికి మొహం, అవయవాలు కాలిపోయిన సందర్భాలు ఉన్నాయి.

కాలని బాణసంచాను

నీళ్లలో పూర్తిగా ముంచాలి.

జాగ్రత్తలు మరువొద్దు

దీపావళి పండగను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలి. శబ్ద కాలుష్య రహిత బాణసంచాకు ప్రాధాన్యమివ్వాలి. బాణసంచా కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి.

– డి.నరసింహకిషోర్‌, ఎస్పీ, తూర్పుగోదావరిజిల్లా

ప్రమోదం కాకూడదు ప్రమాదం

కాలుష్యం నుంచి మాస్క్‌లతో రక్ష

వెలుగుల పండుగకు జిల్లా సిద్ధం

No comments yet. Be the first to comment!
Add a comment
దీపావళి కావాలి ఆనంద కేళి1
1/3

దీపావళి కావాలి ఆనంద కేళి

దీపావళి కావాలి ఆనంద కేళి2
2/3

దీపావళి కావాలి ఆనంద కేళి

దీపావళి కావాలి ఆనంద కేళి3
3/3

దీపావళి కావాలి ఆనంద కేళి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement