నాణ్యమైన ఆహారాన్ని అందించాలి
రాజానగరం: ‘నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని’ డిమాండ్ చేస్తూ ఆదికవి నన్నయ యూనివర్సిటీ ముంగిట హాస్టల్ విద్యార్థినులు బుధవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్బంగా వారు పడుతున్న ఇబ్బందులను ‘సాక్షి’కి తెలియజేశారు.
క్లీనింగ్ సరిగా ఉండదు
హాస్టల్‌లో వంటా వార్పు సెక్షన్‌లో 12 మంది వరకు ఉన్నారు. ఆహారాన్ని తయారు చేయడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అన్నమే కాదు కూరలు కూడా సరిగా ఉడకవు. రెండు కూరలు ఉంటే వాటిలో ఏదో ఒకటే వేసుకోవాలిగానీ, రెండు వేసుకోకూడదు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.
– దివ్య, విద్యార్థిని
నీరసపడుతున్నాం
పక్కనే బాయిస్ హాస్టల్ ఉంది. అక్కడ ఇక్కడున్నట్టుగా ఆహారం విషయమై ఎటువంటి సమస్యలు లేవు. ఇక్కడనే ఎందుకు వస్తున్నాయి. ఇక్కడ నాణ్యత లేని ఆహారం తినడం వలనే అంతా నీరసపడిపోతున్నాం. ఈ పరిస్థితి నెలరోజులుగా మరీ ఎక్కువగా ఉంది. శానిటేషన్ కూడా సరిగా ఉండటం లేదు,
– గాయత్రి, విద్యార్థిని
గైనిక్ సమస్యలొస్తున్నాయి
హాస్టల్‌లో జాయిన్ అయ్యే వరకు గైనిక్ సమస్యలు లేవు. ఇక్కడకు వచ్చిన తరువాత అవి కూడా ఎదురవడంతో ఆహారం వల్లనే అని భావించి వార్డెన్‌కి చెపుతుంటే తింటే తినండి లేకుంటే లేదని విసుక్కుంటున్నారు. అనారోగ్య సమస్యలొస్తే ముఖ్యంగా రాత్రి వేళలలో చూసే వారు ఎవరూ ఉండటం లేదు. గతంలో ఏఎన్‌ఎం ఉండేవారు.
– జ్యోతి, విద్యార్థిని
మౌలిక సదుపాయాలు కల్పించాలి
‘నన్నయ’ వర్సిటీ విద్యార్థినుల డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment