గ్యాస్ సిలిండర్ పేలి రెండు దుకాణాల దగ్ధం
ఉప్పలగుప్తం: టిఫిన్ హోటల్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆ దుకాణంతో పాటు సమీపంలోని టైలరింగ్ షాపు కాలిపోయింది. కూనవరంలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. కూనవరం మేజర్ డ్రెయిన్‌పై ఉన్న వంతెనను ఆనుకుని ఒక పూరి గుడిసెలో బూసి సత్యనారాయణ టిఫిన్ హోటల్ నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగానే మంగళవారం ఉదయం సత్యనారాయణ కుమారుడు రాజేంద్ర ప్రసాద్ హోటల్‌ను తెరిచాడు. లోపల గ్యాస్ పొయ్యిని వెలిగించగానే సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఆ మంటలకు రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే అంబులెన్స్‌లో అమలాపురం ఆసుపత్రికి తరలించారు. హోటల్‌తో పాటు పక్కనే కుంచే వెంకట రమణకు చెందిన టైలరింగ్ షాపు కూడా ఈ ప్రమాదంలో కాలిపోయింది. స్థానికుల సమాచారంతో అమలాపురం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.5 లక్షల వరకూ ఆస్తినష్టం జరిగిందని ఫైర్ సిబ్బంది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment