సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ డి.నరసింహ కిశోర్‌తో కలిసి కలెక్టర్ పి.ప్రశాంతి ఈ వివరాలను వెల్లడించారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం నుంచి కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 20 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సర్వం సిద్ధం చేశామన్నారు. 18 మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో రెండు పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేశామని, సుమారు 2,893 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఎలాంటి అధికారిక కార్యక్రమాలు నిర్వహించకూడదన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు, ఆర్డీఓ టి.శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు.
అమల్లోకి ఎన్నికల కోడ్
జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు
ఓటు హక్కు వినియోగించుకోనున్న 2,893 మంది ఉపాధ్యాయులు
ఎన్నికల షెడ్యూల్
నోటిఫికేషన్ జారీ 11–11– 2024
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 18–11–2024
నామినేషన్ల పరిశీలన 19–11–2024
అభ్యర్థుల ఉపసంహరణ 21–11–2024
పోలింగ్ 05–12–2024
ఓట్ల లెక్కింపు 09–12–2024
ఎన్నికల కోడ్ ముగింపు 12–12–2024
Comments
Please login to add a commentAdd a comment