‘తాడిపర్రు’ బాధితులకు నష్ట పరిహారం
ఉండ్రాజవరం: మండలంలో తాడిపర్రు గ్రామంలో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన నలుగురి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.ఐదు లక్షల చొప్పున పరిహర చెక్కులను ఆర్డీవో రాణి సుస్మిత మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటువంటి పరిస్థితి బాధకరమని, తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన బొల్లా వీర్రాజు, మారిశెట్టి మణికంఠ, పామర్తి నాగేంద్ర, కాసగాని కృష్ణ ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఆమె చెక్కులను అందజేశారు. ఆమె వెంట తహసీల్దార్ పీఎన్‌డీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
టెన్త్ బయాలజీ
మెటీరియల్ ఆవిష్కరణ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా బయాలజీ ఫోరమ్ పదో తరగతి విద్యార్థుల కోసం తయారు చేసిన స్టడీ మెటీరియల్‌ను జిల్లా పాఠశాల విద్యా శాఖాధికారి కె.వాసుదేవరావు మంగళవారం తమ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ ఎంఈవో కుశలవదొర, ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రతినిధులు రమణరావు, గణపతి, జిల్లా బయాలజీ ఫోరమ్ అధ్యక్షుడు శ్రీనివాస నెహ్రూ, ప్రధాన కార్యదర్శి సుధారాణి, ఉపాధ్యాయులు వీరబాబు పాల్గొన్నారు.
పాత పెన్షన్ విధానం
కోసం పోరాటం
సామర్లకోట: రైల్వే ఉద్యోగులు, కార్మికులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ పోరాటం చేస్తోందని సంఘ విజయవాడ డివిజన్ ప్రధాన కార్యదర్శి, ఏఐఆర్‌ఎఫ్ కోశాధికారి సీహెచ్ శంకరరావు అన్నారు. రైల్వే సంఘ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి స్థానిక సంఘ కార్యాలయం వద్ద జరిగిన సభలో మాట్లాడారు. భారతీయ రైల్వేలో యూనియన్ల గుర్తింపు కోసం డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని రైల్వే బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పారు. ఈ మేరకు డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో జరిగే ఎన్నికల్లో తమ సంఘానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ డివిజనల్ కార్యదర్శి ఎం.లీల, అధ్యక్షుడు రామ్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment