లింకు లేకుంటే రాయితీ లేనట్టే! | - | Sakshi
Sakshi News home page

లింకు లేకుంటే రాయితీ లేనట్టే!

Published Thu, Nov 14 2024 9:13 AM | Last Updated on Thu, Nov 14 2024 9:13 AM

లింకు లేకుంటే రాయితీ లేనట్టే!

లింకు లేకుంటే రాయితీ లేనట్టే!

రాజమహేంద్రవరం రూరల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా అందించే రాయితీలకు ఎన్‌పీసీఐ (నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) లింక్‌ తప్పనిసరి చేశాయి. ఇటీవల వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎన్‌సీపీఐ లింకు ఉన్న ఖాతాలు లేకపోవటంతో ప్రభుత్వాల నుంచి వారికి పథకాలు అందకుండా పోయాయి. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో ఎన్‌సీపీఐ లింకులు లేని ఖాతాల జాబితాలను ఆయా ప్రాంతాల వారీగా పంపించింది. ఎన్‌సీపీఐ నిబంధనల ప్రకారం మనుగడలో లేని ఖాతాలను తెరిపించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. త్వరితగతిన పునరుద్దరణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. జిల్లాలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలో నివాసముంటున్న వారికి బ్యాంకు ఖాతాలు ఉన్నప్పటికీ వాటికి ఎన్‌సీపీఐ లింకు లేనట్టు ప్రభుత్వం గుర్తించింది. ప్రతి గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో లబ్ధిదారుల ఖాతాలను డిజిటలైజేషన్‌ చేయాలని ఈ నెల 6వ తేదీన కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీని ప్రకారం లబ్ధిదారులతో పాటు 18 ఏళ్లు నిండివారంతా పోస్టాఫీసుల్లో కొత్త ఖాతాలను తెరవాలి. దీనిపై ఆయా సచివాలయాల పరిధిలో సచివాలయ సెక్రటరీ, వెల్ఫేర్‌, మహిళా సంరక్షణ కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్‌, సర్వేయర్లు, అగ్రికల్చర్‌ సిబ్బందిని సిద్ధం చేశారు.

బ్యాంక్‌ ఖాతాకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి

బ్యాంకు ఖాతాకు ఎన్‌పీసీఐ లింక్‌ తప్పనిసరి చేసిన కేంద్రం

ఈ నెల 6 నుంచి ప్రారంభమైన ప్రక్రియ

ప్రభుత్వం నుంచి మంజూరయ్యే ఏ సంక్షేమ పథకమైనా లబ్ధిదారులకు నేరుగా అందాలంటే బ్యాంకు ఖాతా మనుగడలో ఉండాలి. కొందరికి రెండు, మూడు బ్యాంక్‌ ఖాతాలు ఉండి వాటిలో కొన్ని వినియోగంలోకి లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి మనుగడలోని లేని ఖాతాల వివరాలు పునరుద్ధరించుకునేలా చర్యలు చేపట్టింది. జిల్లాలో 2,59,182 మందికి పైగా ఖాతాదారులకు ఎన్‌పీసీఐ లింక్‌ లేనట్టు గుర్తించాం. వారందరికీ సమాచారం అందించి లింక్‌ చేసుకోవాలని సూచిస్తున్నాం. పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పెషల్‌ క్యాంపులు నిర్వహిస్తున్నాం. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

– వీణాదేవి, డీఎల్‌డీవో, రాజమహేంద్రవరం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement