చర్చి, పాకల కూల్చివేత
ఫ రాజుపాలెంలో దారుణం
ఫ ప్రభుత్వ కక్ష సాధింపేనని బాధితుల ఆరోపణ
పెదపూడి: కూటమి సర్కార్ అరాచక పాలన కొనసాగుతూనే ఉంది. కాకినాడ జిల్లా పెదపూడి మండలం రాజుపాలెం గ్రామంలో 3 పశువుల పాకలను, ఒక చర్చిని అధికారులు కూల్చివేశారు. పశువుల పాకల యజమానులు కర్రి చంద్రరావు, నల్లా వీర వెంకటరమణ, గంజా సూర్యానారాయణ, చర్చి ప్రతినిధి గంపల ఆనందబాబు, గ్రామ మాజీ సర్పంచ్ నాగుమళ్ల వీరభద్రరావు ఈ వివరాలను మీడియాకు తెలిపారు. గ్రామంలో తామంతా 50 ఏళ్లుగా పశువుల పాకలు వేసుకుని సుమారు 20 నుంచి 30 పశువులను మేపుతున్నామని చెప్పారు. అలాగే చర్చి కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఆ స్థలాలకు ప్రభుత్వం నుంచి చాలాకాలం కిందటే పట్టాలు పొందామని, పన్నులు చెల్లిస్తున్నామని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తాము వైఎస్సార్ సీపీ సానుభూతి పరులమంటూ.. ఎటువంటి కారణం చెప్పకుండా, ముందస్తు నోటీసు ఇవ్వకుండా అర్‌అండ్‌బీ ఏఈ బి.లోవరాజు, తహసీల్దార్ సీతాపతి పోలీసులు కలిసి సుమారు 30 మంది అధికారులు శనివారం ఉదయం 5 గంటలకే వచ్చారని చెప్పారు. జేసీబీతో పాకలను, చర్చిని ఒక్కసారిగా నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మూగజీవాలను బయటకు తీసుకురాక ముందే దౌర్జన్యంగా పాకలు, చర్చిని కూల్చివేశారని చెప్పా రు. కేవలం కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ దారుణానికి ఒడిగట్టారన్నారు. కాగా, నిబంధనల ప్రకారమే ఆక్రమణలు తొలగించామని అర్‌అండ్‌బీ ఏఈ లోవరాజు సమాధానమిచ్చారు.
పెచ్చుమీరిన దౌర్జన్యాలు : కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలు పెచ్చుమీరాయని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మండిపడ్డారు. రాజుపాలెంలో తొలగించిన పశువుల పాకలు, చర్చి ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేస్తున్న దౌర్జన్యాలకు ఇది మరో నిదర్శనమన్నారు. పేదలు సుమారు 50 ఏళ్లుగా పాకలు వేసుకుని పశువులను మేపుతున్నారన్నారు. వారికి గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టా ఉందని, పన్ను చెల్లిస్తున్నారన్నారు. దీనికి అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తొలగించడం అన్యాయమన్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతి పరులను ఇబ్బంది పాల్జేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏవిధంగా దౌర్జన్యకాండను ప్రోత్సహిస్తున్నారో అంతా చూస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో దీని ఫలితాన్ని వారు చూస్తారని హెచ్చరించారు. పార్టీ మండల కన్వీనర్ గుత్తుల రమణ, నాయకుడు సుందరపల్లి వీరభద్రం తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment