కొనసాగుతున్న అక్రమ అరెస్టులు
తుని/తుని రూరల్: ప్రభుత్వ విధి విధానాలకు, టీడీపీ, జనసేన, బీజేపీలకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీకి లబ్ధి చేకూర్చేందుకు నియోజకవర్గంలో రాజకీయ అనిశ్చితి ప్రేరేపించేలా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టిన 17 మందిని అరెస్టు చేసినట్టు రూరల్ సీఐ జి.చెన్నకేశవరావు తెలిపారు. తుని రూరల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం పట్టణ సీఐ గీతారామకృష్ణ, రూరల్ ఎస్సై బి.కృష్ణామాచారితో కలసి రూరల్ సీఐ విలేకరులతో మాట్లాడారు. అరైస్టెన వారిలో తుని పట్టణ, తుని, కోటనందూరు, తొండంగి మండలాలకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, ఇద్దరు కౌన్సిలర్లు ఉన్నారు. వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్టు సీఐ తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినా, తప్పుడు సమాచారాన్ని బదిలీ చేసినా శిక్షార్హులన్నారు. రెండుసార్లు కేసులు నమోదైన తర్వాత ఇటువంటి తప్పిదానికి మూడోసారి (ఆర్గనైజ్డ్ క్రైం) పాల్పడితే నాన్ బెయిల్‌బుల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కేసులో ఐదు నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందన్నారు. కక్ష సాధింపులు లేవని, ఏ పార్టీవారు ఆధారాలు ఇచ్చినా సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామన్నారు.
అరైస్టెన వారు
వైఎస్సార్ సీపీ యువజన విభాగం తుని నియోజకవర్గ అధ్యక్షుడు, తుని కౌన్సిల్‌లో కో–ఆప్షన్ సభ్యుడు ఏలూరి బాలు, 14వ వార్డు కౌన్సిలర్, పట్టణ యూత్ కన్వీనర్ షేక్ ఖ్వాజా మోహిద్దీన్, తొండంగి మండలం వైస్ ఎంపీపీ నాగం గంగాధరరావు, వైఎస్సార్ సీపీ కోటనందూరు మండల కన్వీనర్ చింతకాయల సన్యాసి రాజా విశ్వనాథ్ (చినబాబు), వెలుగొండి జార్జి కిరణ్ (జార్జిరెడ్డి), ఇసరపు సాయి, మొగసాల నాగ రామశ్రీను, దిబ్బ శ్రీను, పెంటకోట వెంకట రామలింగ సురేష్, కోరుమల్లి లలిత, అడపా సురేష్, గణేసుల వీర వెంకటరమణ (వీరబాబు), బంగారు బ్రహ్మనాయుడు, యలమంచిలి మణికంఠ, కాకినాడ గణేష్ (నాని), చింతంనీడి గణేష్, కుర్మయ్యగారి హనుమంత్ రెడ్డి (అన్నమయ్య జిల్లా) అరెస్టయ్యారు. 15 మందికి స్టేషన్ బెయిల్ ఇచ్చామని, ఏలూరి బాలు, షేక్ ఖ్వాజాలను కోర్టులో హాజరుపర్చామన్నారు.
వైఎస్సార్ సీపీ నాయకులు,
సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ల అరెస్టు
17 మందిలో వైస్ ఎంపీపీ,
ఇద్దరు కౌన్సిలర్లు
Comments
Please login to add a commentAdd a comment