వచ్చేనెల 8 నుంచి దివ్యాంగుల క్రికెట్ టోర్నీ
సీటీఆర్‌ఐ: దివ్యాంగుల క్రికెట్ టోర్నీ వచ్చేనెల 8వ తేదీ నుంచి విశాఖలో నిర్వహిస్తున్నట్టు అఖిల భారత దివ్యాంగుల హక్కుల జాతీయ కార్యదర్శి ముత్యాల పోసికుమార్ అన్నారు. రాష్ట్ర దివ్యాంగుల క్రికెట్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జి పల్నాటి బలరామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక వై జంక్షన్ వద్ద ఈ టోర్నీ సన్నాహక సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోసికుమార్ మాట్లాడుతూ డిసెంబర్ 8 నుంచి 11వ తేదీ వరకు విశాఖలోని గాజువాక జింక్ గ్రౌండ్‌లో పది జిల్లాల దివ్యాంగుల క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు 98858 64940, 92473 86666 ఫోన్ నెంబర్లను సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. 22వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు లాలాచెరువు మైదానంలో ఎంపికలు ఉంటాయన్నారు. బలరామకృష్ణ మాట్లాడుతూ ఈ సదవకాశాన్ని దివ్యాంగులంతా ఉపయోగించు కోవాలని, బుధ, గురు వారాలలో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
ప్రపంచ స్థాయి పరిశోధనలు అవసరం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): వాణిజ్య పంటల పరిశోధనా కేంద్రంగా సీటీఆర్‌ఐ రూపాంతరం చెందుతున్న తరుణంలో పరిశోధన కమిటీ సమావేశాలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయని, వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రపంచ స్థాయిలో పరిశోధనలు చేపట్టాలని ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. మంగళవారం రెండో రోజు మూడు, నాలుగో సాంకేతిక సమావేశానికి ఆయనతో పాటు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పూర్వ డీన్ డాక్టర్ జె.కృష్ణప్రసాద్, సీటీఆర్‌ఐ పూర్వ డివిజన్ హెడ్ డాక్టర్ యు. శ్రీధర్, ఇన్నోవేషన్ హబ్, ఇక్రిసాట్ విభాగాధిపతి డాక్టర్ ఆర్. శ్రీకాంత్ నిపుణులుగా వ్యవహరించారు. పలువురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ఫలితాలను వివరించారు.
విశాఖపట్నం గాజువాకలోని జింక్ మైదానంలో నిర్వహణ
అఖిల భారత దివ్యాంగుల హక్కుల జాతీయ కార్యదర్శి పోసికుమార్
విజయవంతం చేయాలని జిల్లా కెప్టెన్ బలరామకృష్ణ పిలుపు
Comments
Please login to add a commentAdd a comment