రత్నగిరి ఘాట్‌రోడ్డులో అగ్నిప్రమాదం
అన్నవరం: సత్యదేవుని దర్శనానికి మంగళవారం తాడేపల్లిగూడెం నుంచి కారులో వచ్చిన భక్తులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న కారులో అగ్నిప్రమాదం సంభవించి కారు బోనెట్ నుంచి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన భక్తులు వెంటనే బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఏలూరు జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన ఇద్దరు చిన్నారులతో సహా ఏడుగురు మంగళవారం సత్యదేవుని దర్శనానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఘాట్‌రోడ్ రెండో మలుపులో కారు ఇంజిన్ నుంచి పొగ రావడాన్ని గమనించి పక్కకి ఆపి అందరూ దిగిపోయారు. కారు లోపలకు మంటలు వ్యాపించడంతో స్టీరింగ్ వద్ద ముందు భాగం కాలిపోయింది. వెంటనే తమ వద్ద నున్న వాటర్ బాటిళ్లలోని నీళ్లతో మంటలు అదుపుచేశారు. తరువాత వేరే కారులో తమ స్వస్థలానికి చేరుకున్నారు. ఎవరికీ ఏ అపాయం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కారులో వ్యాపించిన మంటలు
వెంటనే దిగి తప్పించుకున్న భక్తులు
Comments
Please login to add a commentAdd a comment