కోడ్‌ను వెక్కిరిస్తున్న ఫ్లెక్సీలు
కె.గంగవరం: మండల పరిధిలోని కోటిపల్లి గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఇంకా అమలులోకి రానట్టే ఉంది! గ్రామం నడిబొడ్డునే ఏర్పాటు చేసిన రాజకీయ నాయకులు ఫ్లెక్సీలే దీనికి నిదర్శనం. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్, ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ కార్యదర్శి కె.హర్షవర్థన్ శుక్రవారం కోటిపల్లిలో పర్యటించారు. ఆయన వచ్చి వెళ్లారు కానీ అధికారులు మాత్రం గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మాత్రం తొలగించలేదు. ప్రతి గ్రామంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజకీయ నేతల ఫ్లెక్సీలను తొలగించిన సంగతి తెలిసిందే. కానీ కోటిపల్లిలో మాత్రం అధికారుల నిర్లక్షమో లేక ప్రజాప్రతినిధుల పట్ల అంకితా భావమో తెలి యని పరిస్థితి ఉందని స్థానికులు అంటున్నారు.
రేపు ఉమ్మడి జిల్లా హేతువాద మహాసభ
అమలాపురం టౌన్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా హేతువాద సంఘం వార్షిక మహాసభను ఆదివారం అమలాపురంలోని ఎస్‌టీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఈ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేవీవీ సత్యనారాయణ, డి.రాజశేఖర్‌లు తెలిపారు. మహాసభలో హేతువాదం, మానవ వాదం అధ్యయన తరగతులతో పాటు గ్రంధ ఆవిష్కరణ జరుగుతుందని పేర్కొన్నారు. మహాసభకు హైదరాబాద్‌కు చెందిన భారత హేతువాత సంఘం అధ్యక్షుడు డాక్టర్ గుమ్మా వీరన్న, భారత చైర్మన్ మేడూరి సత్యనారాయణ తదితర సంఘ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న హేతువాదులు, అభ్యుదయ వాదులు మహాసభకు హాజరుకావాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఎనిమిది మంది
బైండోవర్
అల్లవరం: అల్లవరం తహసీల్దార్ కార్యాలయంలో ఎనిమిది మందిపై బైండోవర్ కేసులను శుక్రవారం నమోదు చేశారని ఎకై ్సజ్ సీఐ వీటీవీవీ సత్యనారాయణ తెలిపారు. వివిధ మద్యం కేసుల్లో ముద్దాయిలైన బోడసకుర్రుకు చెందిన పి.సూర్యప్రకాష్, ఆవాల రవితేజ, గుబ్బల సత్యనారాయణ, అల్లవరానికి చెందిన టి.జానకిరామారావు, ఆర్.ఆదినారాయణమూర్తి, డి.రావులపాలానికి చెందిన ఎ.సూర్యనారాయణ, బెండమూర్లంకకు చెందిన కె.నాగేశ్వరరావు, శిరగట్లపల్లికి చెందిన ఎస్.మీరమ్మలను మండల ఎగ్జికూటివ్ మేజిస్ట్రేట్ నరింహరావు ముందు హాజరుపరచగా వీరికి రూ.లక్ష చొప్పున పూచీకత్తు విధించారని ఎకై ్సజ్ సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment