తేరేగింపు!
కొత్తపేట: ప్రజలను విశేషంగా ఆకర్షిస్తూ రథం వెనుక రథం పయనమవుతున్నాయి. వాటి ముందు కొందరు యువకులు రోడ్డుకు ఇరువైపులా వ్యాపారులకు, గృహస్తులకు రాకపోకలు సాగిస్తున్న వాహనాదారులకు కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఇంతకీ ఆ రథాల యాత్ర ఏమిటనుకుంటున్నారా? కొత్తపేట మండలం మోడేకుర్రు శివారు గొలకోటివారిపాలెంలో పంచముఖ ఆంజనేయస్వామి వారి ఆలయ చతుర్థ వార్షికోత్సవం ఈ నెల 25న జరగనుంది. ఆలయ నిర్మాణకర్త గొలకోటి మాచరరావు (ఈవెంట్స్ మాధవ్) ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీన్ని పురస్కరించుకుని కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాలతో పాటు అమలాపురం ప్రాంతాల్లో వృషభ, గజ, అశ్వ, హంస, ఒంటె వాహన రథాల ఊరేగింపుతో ప్రజలను ఆహ్వానిస్తూ చేపట్టిన కార్యక్రమం ఆకట్టుకుంది. దారి పొడవునా ఆ వాహనాలతో అనేకమంది సెల్ఫీలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment