రెండు రోజులకే కూలిన గడ్డర్
కొవ్వూరు: రోడ్డు కం రైల్వే వంతెనపై భారీ వాహనాలను నియంత్రించే ఉద్దేశంతో రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన గడ్డర్ కూలిపోయింది. గు రువారం అర్ధరాత్రి వంతెనపై నుంచి వచ్చిన భా రీ వ్యాన్ ఢీకొట్టడంతవిది కూలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. కూలిన గడ్డర్‌ను రైల్వే సీఐ సైదయ్య, ఎస్సై ఎల్.విశ్వనాథం పరిశీలించారు. ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడి గడ్డర్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పునాది పటిష్టంగా లేనందువల్లనే గడ్డర్ కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు.
రుడా చైర్మన్‌గా రేపు
బాధ్యతల స్వీకరణ
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రజా ప్రయోజనాలే ధ్యే యంగా పని చేస్తానని రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) చైర్మన్‌గా నియమితులైన బొడ్డు వెంకట రమణ చౌదరి చెప్పారు. ఈ బాధ్యతలు ఆదివారం స్వీకరిస్తానని తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుడా పరిధిలోని నియోజకవర్గాల్లో అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. రుడా విస్తరణ, చేపట్టిన పనులు, చేపట్టాల్సిన పనులపై ఇప్పటికే మున్సిపల్ కమిషనర్‌తో చర్చించానని చెప్పారు. రుడా ప్రక్షాళనకు నాంది పలకనున్నట్లు స్పష్టం చేశారు. రుడా చైర్మన్‌గా కొనసాగుతూనే టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తానని చెప్పారు.
మద్యం షాపు వద్దని
ముస్లింల రాస్తారోకో
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): మద్యం షాపు ఏర్పాటును నిరసిస్తూ ముస్లింలు శుక్రవారం రాస్తారోకో చేశారు. వెంటనే తొలగించకపోతే ఆమరణ దీక్ష చేస్తామని హెచ్చరించారు. దానవాయిపేట మసీదులో శుక్రవారం నమాజ్ అనంతరం మసీద్ కమిటీ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. స్థానిక గోరక్షణపేట నీళ్ల ట్యాంకుల ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటుకు సన్నాహా లు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రజల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సమీపంలోనే వినాయక ఆలయం, మసీదు, చర్చి స్థలం ఉన్నాయి. అందరూ పవిత్రంగా భావించే ఈ ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటును స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్‌లకు వినతి పత్రాలు ఇచ్చారు. కానీ షాపు ఏర్పాట్లు ఆగకపోవడంతో ముస్లింలు నిరస న తెలిపారు. మహమ్మద్ ఆరిఫ్, కరీం ఖాన్, మహమ్మద్ షబ్బీర్, సయ్యద్ గౌస్, ఎండీ ఆరిఫ్, సయ్యద్ అబ్దుల్ షరీఫ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment