బెల్ట్ షాపుపై ఎకై ్సజ్ అధికారుల దాడి
● జనసేన పార్టీ కార్యకర్తపై కేసు నమోదు
● 126 మద్యం, నాలుగు బీరు సీసాలు
స్వాధీనం
కరప: మండలంలోని పెనుగుదురులో ఒక మద్యం బెల్టు షాపుపై ఎస్‌టీఎఫ్ (స్పెషల్ టాస్క్‌ఫోర్స్), తాళ్లరేవు ఎకై ్సజ్‌శాఖ అధికారులు దాడి చేసి, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 126 మద్యం సీసాలు (180 ఎంఎల్), నాలుగు బీరు సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ అధికారులు తెలిపిన మేరకు... పెనుగుదురులో బెల్ట్ షాపు నిర్వహిస్తున్నట్టు మంగళగిరిలోని డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు సమాచారం అందింది. అక్కడి అధికారుల ఆదేశాల మేరకు ఎస్‌టీఎఫ్, మంగళగిరి ఎన్‌ఫోర్స్‌మెంట్ సభ్యుల బృందం గురువారం పెనుగుదురులో దాడి చేసింది. బెల్ట్‌షాపు నిర్వహిస్తున్న జనసేన పార్టీ కార్యకర్త పప్పుల ఆదివిష్ణు మల్లేశ్వరరావును అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి 126 మద్యం, నాలుగు బీరు సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు పంపించారు. స్థానిక ఎమ్మెల్యే, నాయకులు జనసేన పార్టీ కార్యకర్తపై కేసు నమోదు చేయకుండా వదిలేయాలని ఎంతగా ఒత్తిడి తీసుకొచ్చినా ఫలించలేదు. కరపలోని జనసేన పార్టీ నాయకులకు చెందిన మద్యం దుకాణం నుంచి మద్యం సీసాలు తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. బెల్ట్ షాపునకు మద్యం సీసాలు అమ్మిన షాపుపై కేసు నమోదు చేస్తారో, అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి వదిలేస్తారోనని గ్రామంలో చర్చించుకుంటున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ బెల్ట్ షాపు నిర్వహిస్తే రూ.5 లక్షలు అపరాధ రుసుం వసూలు చేస్తామని చెప్పారని, అది అమలులో చూపించాలని మహిళలు కోరుతున్నారు. ఈ దాడిలో ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ తాళ్లరేవు సీఐ కె.కోటేశ్వరరావు, ఎస్‌ఐ వై.నాగేంద్రకృష్ణ, ఎస్‌టీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment