జీజీహెచ్‌ను పరిశీలించిన ఎన్‌సీడీ బృందం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక జీజీహెచ్ లోని ప్రివెంటివ్ అంకాలజీ ఓపీడీ 222 ను రాష్ట్ర ఎన్‌సీడీ నోడల్ అధికారి డాక్టర్ శ్యామల, డబ్ల్యూఓహెచ్ అధికారులు డాక్టర్ పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా నోటి కేన్సర్, గర్భాశయ కేన్సర్ నిర్ధారణ పరీక్షలు, డాక్టర్ రోగులను ఎలా చూస్తున్నారు, అందిస్తున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యప్రభ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల నుంచి వైద్యులు కేన్సర్ అనుమానిత కేసులను ఓపీడీ 222 రెఫరల్ కార్డుతో (పింక్ రంగు) పంపుతారని తెలిపారు. ఇక్కడ ప్రివెంటివ్ అంకాలజీ నోడల్ అధికారి ఓపీడీ డాక్టర్ ప్రశాంత్ పరిశీలించిన తరువాత రోగి లక్షణాలను గుర్తిస్తామన్నారు. అనంతరం దంత, సర్జరీ, గైనిక్ విభాగపు వైద్యుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తారని తెలిపారు. వైద్య సేవలల్లో భాగంగా ప్రతి మంగళవారం, గురువారం కేన్సర్ వ్యాధి చూస్తారని తెలిపారు. పరీక్షలు చేయించుకున్న ప్రజలతో మాట్లాడి వారి ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్టు చెప్పారు. జిల్లా ఎన్సీడి ప్రోగ్రాం అధికారి డాక్టర్ హరిచంద్ర, డీపీఎంవో డాక్టర్ అభిషేక్, డాక్టర్ సుధీర్, డీపీవో సంధ్య, అలి బేగ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment