ఏఎంసీ చెక్‌పోస్టుల్లో డిజిటల్ చెల్లింపులు
కొవ్వూరు: స్థానిక గామన్ ఇండియా టోల్‌గేట్ జంక్షన్ సమీపాన ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చెక్‌పోస్టు వద్ద డిజిటల్ చెల్లింపులను ప్రయోగాత్మకంగా ప్రారంభించామని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు తెలిపారు. ఈ ప్రక్రియను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతో కలసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏఎంసీ చెక్‌పోస్టు వద్ద నగదు రూపంలో కాకుండా.. ఈ–పోస్ పరికరం సహాయంతో డిజిటల్ చెల్లింపుల ద్వారా సెస్ వసూలు చేస్తామని వివరించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా దీనిని కొవ్వూరులో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని చెప్పారు. రానున్న రోజుల్లో జిల్లాలోని 12 ఏఎంసీ చెక్‌పోస్టుల్లో ఈ విధానం అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలను నివారించేందుకే డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. అలాగే, చెక్‌పోస్టుల వద్ద ఆర్థిక అక్రమాలకు కూడా పూర్తిగా చెక్ పెట్టే అవకాశం కలుగుతుందన్నారు. యాక్సిస్ బ్యాంకు ఆధ్వర్యాన ఈ–పోస్ యంత్రం పని చేస్తుందని చెప్పారు. కొవ్వూరు ఏఎంసీ ద్వారా ఈ ఏడాది రూ.1.60 లక్షల సెస్ వసూలైందని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. కాపవరంలో అసంపూర్తిగా ఉన్న ఏఎంసీ భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ రాణి సుస్మిత, తహసీల్దార్ ఎం.దుర్గా ప్రసాద్, మార్కెటింగ్ ఏడీ ఎం.సునీల్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కొవ్వూరులో ప్రయోగాత్మకంగా
ప్రారంభం
ఫ ఆర్థిక అక్రమాలు అరికట్టేందుకే..
ఫ జేసీ చిన్నరాముడు
Comments
Please login to add a commentAdd a comment