కిక్కే..కిక్కు
రాజమహేంద్రవరం రూరల్: మద్యం విక్రయాల ద్వారా వీలైనంత ఎక్కువ ఆదాయం పొందడంతో పాటు మందుబాబులను ఫుల్ కిక్కులో ముంచే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తాజాగా జిల్లాలో 2 బార్లకు, ఒక ప్రీమియం లిక్కర్ స్టోర్ ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చింది. నిడదవోలులో రెన్యువల్ చేయించుకోని రెండు బార్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు ఒక ప్రీమియం లిక్కర్ స్టోర్ ఏర్పాటుకు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రీమియం లిక్కర్ స్టోర్‌కు దరఖాస్తుదారు నాన్ రిఫండబుల్‌గా రూ.15 లక్షల డీడీ ఇవ్వాలి. అలాగే లైసెన్సుకు రూ.కోటి చెల్లించాలి. లైసెన్సు వచ్చిన తరువాత 4 వేల చదరపు అడుగుల్లో స్టోర్ ఏర్పాటు చేయాలి. ఇందులో రూ.1,200కు పైగా ధర ఉన్న లిక్కర్, రూ.400 పైగా రేటు ఉన్న బీర్లను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. జిల్లాలో ఇప్పటికే ఉన్న 24 బార్లు, 125 మద్యం షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతోంది. ఈ పరిస్థితుల్లో అదనంగా మరో రెండు బార్లు, ప్రీమియం లిక్కర్ షాపు ఏర్పాటు చేస్తే మందుబాబులకు పట్టపగ్గాలుండవని, పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment