రూ.75 స్మారక నాణెం సేకరణ
అమలాపురం టౌన్: నేషనల్ క్యాడెట్ కోర్ (ఎన్‌సీసీ) సంస్థ వజ్రోత్సవం సందర్భంగా ముంబై టంకశాల విడుదల చేసిన రూ.75 స్మారక నాణేన్ని అమలాపురానికి చెందిన పుత్సా కృష్ణ కామేశ్వర్ ప్రత్యేక ఆర్డర్‌పై సేకరించారు. 35 గ్రాముల బరువుతో ఉన్న ఈ నాణెం 50 శాతం వెండి, 40 శాతం రాగి, నికెల్, జింక్ చెరో 5 శాతంతో తయారు చేశారు. నాణెం ఓ వైపు నేషనల్ క్యాడెట్ కోర్ ఎంబ్లమ్, రెండో వైపు రూ.75 ముఖ విలువ ముద్రించారు.
రైలు ఢీకొని వ్యక్తి మృతి
నిడదవోలు : పట్టణ పోలీస్‌స్టేషన్ సమీపంలో చినకాశిరేవు రైల్వే ట్రాక్ వద్ద బుధవారం రాత్రి గుర్తు తెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. తాడేపల్లిగూడెం జీఆర్పీ ఎస్సై పి.అప్పారావు తెలిపిన వివరాల మేరకు..నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన రాకుర్తి నాగేంద్రరావు (55) రాజమహేంద్రవరం వి.స్టార్ హాస్పిటల్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. తన విధులు ముగించుకుని రైలు ఎక్కి నిడదవోలు ఇంటికి బయలుదేరాడు. నిడదవోలు పట్టణంలోని కాశిరేవు వద్ద ఔటర్‌లో రైలు ఆగిన తర్వాత కిందకు దిగిపోయాడు. మరో ట్రాక్ దాటుతుండగా విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న గుర్తు తెలియని రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు రైల్వే పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి భార్య రాజారత్నం ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment