అశ్వవాహనంపై శ్రీవారు | - | Sakshi
Sakshi News home page

అశ్వవాహనంపై శ్రీవారు

Published Thu, Jan 16 2025 8:17 AM | Last Updated on Thu, Jan 16 2025 8:16 AM

అశ్వవ

అశ్వవాహనంపై శ్రీవారు

పెరవలి: మకర సంక్రాంతి, కనుమ పండగల సందర్భంగా అన్నవరప్పాడు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం భక్తులతో పోటెత్తింది. సంక్రాంతి సందర్భంగా స్వామివారిని మంగళవారం గజ వాహనంపై, కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం అశ్వ వాహనంపై గ్రామంలో ఘనంగా ఊరేగించారు. తమ చెంతకే వచ్చిన శ్రీవారికి భక్తులు కానుకలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. మూడు రోజులుగా స్వామి, అమ్మవార్లు వివిధ వాహనాలపై భక్తులకు వారి చెంతనే దర్శనమిచ్చారు.

బీచ్‌లో డ్రోన్లతో నిఘా

కాకినాడ రూరల్‌: సంక్రాంతి పండగను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆధ్వర్యాన పోలీసులు కాకినాడ బీచ్‌లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పండగ సందర్భంగా అధిక సంఖ్యలో ప్రజలు బీచ్‌కు వస్తారనే అంచనాతో ఉప్పాడ కొత్తపల్లి నుంచి కాకినాడ సూర్యారావుపేట బీచ్‌ వరకూ డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. తిమ్మాపురం, యు.కొత్తపల్లి పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని బీచ్‌లలో ప్రజలకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధిక సంఖ్యలో సివిల్‌, మైరెన్‌ పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. అధిక సంఖ్యలో సందర్శకులు బీచ్‌కు రావడంతో సూర్యారావుపేట – ఉప్పాడ బీచ్‌ రోడ్డులో ట్రాఫిక్‌ స్తంభించింది. ఎప్పటికప్పుడు పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

కిక్కిరిసిన అంతర్వేది

సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనృసింహుని క్షేత్రం మంగళ, బుధవారాలలో సంక్రాంతి, కనుమ పర్వదినాలు పురస్కరించుకుని భక్తులతో కిక్కిరిసింది. ఆలయ ప్రాంగణం ఎటు చూసినా భక్తులతో రద్దీగా మారింది. ఆలయంలో నిత్యం నిర్వహించే నారసింహ సుదర్శన హోమంలోను, విశేష అభిషేకంలోను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల క్యూ లను, అన్నదాన పథకాన్ని అసిస్టెంట్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ పర్యవేక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అశ్వవాహనంపై శ్రీవారు 1
1/2

అశ్వవాహనంపై శ్రీవారు

అశ్వవాహనంపై శ్రీవారు 2
2/2

అశ్వవాహనంపై శ్రీవారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement