నేటి నుంచి జాతీయ స్థాయి చెస్ పోటీలు
పెద్దాపురం: స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో శుక్రవారం నుంచి 22వ తేదీ వరకు జాతీయ చెస్ చాంపియన్ షిప్–2025 పోటీలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎస్.షణ్మోహన్ తెలిపారు. పోటీల నిర్వహణ ఏర్పాట్లను గురువారం ఆయన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఆర్డీఓ కె.శ్రీరమణి, రెవెన్యూ, పోలీస్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ 28 రాష్ట్రాలకు చెందిన 1,239 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. చెస్ ఆర్బిటర్స్, వలంటీర్లు, క్రీడాకారుల తల్లిదండ్రులు సుమారు వెయ్యి మంది వస్తారన్నారు. పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయ్‌ప్రకాష్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, స్పోర్ట్స్ అథారిటీ అధికారి శ్రీనివాసకుమార్, చైన్నె చీఫ్ ఆర్బిటర్ పాల్ ఆరోగ్యరాజ్, పెద్దాపురం చెస్ అసొసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కేవీవీ శర్మ, సురేష్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment