పొలాల్లోకి దూసుకుపోయిన బస్సు
ప్రత్తిపాడు: స్థానిక జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. బస్సు టైర్ పేలి, అదుపుతప్పి డివైడర్ పైనుంచి, ఎదురు మార్గంలోకి పోయి, రెయిలింగ్‌ను ఢీకొని పంట పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ప్రయాణికుంతా క్షేమంగా బయట పడ్డారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. సుమారు 47 మంది ప్రయాణికులతో విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్ బస్ టైర్ ప్రత్తిపాడు జాతీయ రహదారిపై శ్రీపాదాలమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో పేలిపోయింది. దీంతో బస్ అదుపుతప్పి డివైడర్‌ను దాటి పక్క రోడ్డు రెయిలింగ్‌ను ఢీకొని, పంట పొలాల్లోకి దూసుకుపోయింది. ఆ సమయంలో రాజమహేంద్రవరం నుంచి విశాఖ మార్గంలో వాహనాలు రాక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దుర్ఘటన నుంచి డ్రైవర్‌తో సహా ప్రయాణికులంతా క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం సంఘటనా స్థలానికి చేరకుని, పరిస్థితిని సమీక్షించారు. బస్ టైర్ పేలడం మినహా అంతా క్షేమమన్నారు. ప్రయాణికులను వేరే బస్సుల్లో రాజమహేంద్రవరం పంపారు.
తప్పిన పెను ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment