గేదెల్లంక ఉత్తర వాహిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తా
మంత్రి దుర్గేష్
ముమ్మిడివరం: మండలంలోని గేదెల్లంక ఉత్తరవాహిని ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ముమ్మిడివరం మండలం గేదెల్లంక ఉత్తర వాహిని పుష్కరాల రేవు ప్రాంతాన్ని మంగళవారం ముమ్మిడివరం, పెద్దాపురం ఎమ్మెల్యేలు దాట్ల సుబ్బరాజు, నిమ్మకాలయ చినరాజప్పలతో కలిసి ఆయన పరిశీలించారు. గోదావరి నది మూడు పాయలు గేదెల్లంక వద్ద ఉత్తరం వైపు ప్రవహించడంతో ఈ ప్రాంతం త్రివేణి సంగమంగా విశిష్టత పొందిందన్నారు. పబ్లిక్, ప్రయివేటు భాగస్వామ్యంతో పిలిగ్రిం టూరిజం, ఎకో టూరిజం తోపాటు వాటర్‌స్పోర్ట్స్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment