జాతీయ స్థాయి గుర్తింపు అభినందనీయం
కౌడా చైర్మన్ రామస్వామి
పెద్దాపురం: జాతీయ స్థాయిలో పెద్దాపురం పట్టణానికి మంచి గుర్తింపు తీసుకురావడంలో శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల కృషి అభినందనీయమని కాకినాడ నగరాభివృద్ధి సంస్థ (కౌడా) చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు) అన్నారు. పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో ఐదు రోజుల పాటు నిర్వహించిన 13వ జాతీయ చెస్ చాంపియన్ షిప్–2025 పోటీలు మంగళవారం అట్టహాసంగా ముగిశాయి. పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయ్‌ప్రకాష్ అధ్యక్షతన నిర్వహించిన చెస్ పోటీల ముగింపు వేడుకలకు బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కుడా చైర్మన్ తుమ్మలబాబు మాట్లాడుతూ క్రీడాకారులు భవిష్యత్‌లో ఎంతో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి మంచి స్థానాన్ని అధిరోహించాలన్నారు. ఏపీ చెస్ అసొసియేషన్ ప్రెసిడెంట్ అడుసుమిల్లి సురేష్, చెస్ అసోసియేషన్ చైర్మన్ కేవీవీ శర్మ మాట్లాడుతూ జాతీయ స్థాయి క్రీడలకు అవకాశం కల్పించిన విజయ్ ప్రకాష్ కృషి అభినందనీయమన్నారు. విజయ్‌ప్రకాష్ మాట్లాడుతూ అండర్–7 నుంచి అండర్–12 వరకు 12 విభాగాల్లో 28 రాష్ట్రాల నుంచి 1,200 మంది విద్యార్ధులు ఈ పోటీల్లో పాల్గొన్నారన్నారు. విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశాకు. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ హెచ్‌ఓడీ అజిత్‌కుమార్ వర్మ, ఆర్‌ఎస్‌ఎస్ రామచంద్రరావు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఏ.రవినాయుడు, ఏపీ అసోషియేషన్ సీఈఓ కాళ్ల జ్వాలాముఖి, చెస్ అసొసియేషన్ ఏపీ సెక్రటరీ కె.జగదీష్, శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి, పాఠశాల కో–ఆర్డినేటర్లు రామకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment