ఎన్‌పీసీఐ లింకేజీలో ఫస్ట్
రూ.50 కోట్ల ప్రీమియం లక్ష్యం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో రూ.50 కోట్ల ప్రీమియంను రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేయడం లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. ఇప్పటి వరకు 90 శాతం లక్ష్యాన్ని అధిగమించగా, రానున్న రెండు నెలల్లో మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం డివిజన్ పోస్టల్ కార్యాలయంలో రోజుకు 70 నుంచి 80 మంది వరకు పాస్‌పోర్ట్ కోసం నూతనంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. డివిజన్ పరిధిలో 34 తపాలా కార్యాలయాల్లో శిక్షణ పొందిన ఉద్యోగుల ద్వారా ఆధార్ మార్పులు, చేర్పుల సేవలను తక్కువ ఫీజుతో అందిస్తున్నామన్నారు.
రాయవరం: నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ) పోస్టల్ ఖాతా లు ఉన్నవారికి అన్ని సంక్షేమ పథకాలను అందించడంలో రాజమహేంద్రవరం డివిజన్ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని రాజమహేంద్రవరం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.శేషారావు తెలిపారు. రాయవరం బ్రాంచి పోస్టాఫీసును ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 2018 సెప్టెంబర్ 1న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు నేరుగా అందాలన్న లక్ష్యంతో ఎన్‌పీసీఐ ఖాతాలతో అనుసంధానం చేశారన్నారు. రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో 301 తపాలా శాఖల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం, రంపచోడవరంలో ఏటీఎం సేవలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. 307 బ్రాంచ్ పోస్టాఫీ సుల ద్వారా పొదుపు ఖాతాలు, ఆర్‌డీ, టెర్మ్ డిపాజిట్లు, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్స్, సీనియర్ సిటిజన్, కిసాన్ వికాస్ పత్రాలు, నేషనల్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి సేవలను ప్రజలకు అందిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment