దేవాలయాల పరిరక్షణకు జాతీయ ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

దేవాలయాల పరిరక్షణకు జాతీయ ఉద్యమం

Published Wed, Jan 22 2025 12:08 AM | Last Updated on Wed, Jan 22 2025 12:08 AM

దేవాల

దేవాలయాల పరిరక్షణకు జాతీయ ఉద్యమం

సీఆర్‌పీల

భవితవ్యం ప్రశ్నార్థకం

ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్ల(సీఆర్‌పీ)ను సైతం తగ్గించనున్నారు. బీఈడీ అర్హత ఉండటంతో వారికి గత ప్రభుత్వం క్లస్టర్‌ రిజర్వ్‌ మొబైల్‌ టీచర్లు(సీఆర్‌ఎంటీ)గా గుర్తింపు ఇచ్చింది. దీంతోపాటు మండలంలో ఎక్కడైనా ఉపాధ్యాయులు సెలవుల్లో ఉన్నప్పుడు బోధనకు అంతరాయం లేకుండా వీరు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంది. ప్రస్తుతం క్లస్టర్‌ విధానం అమలులోకి వస్తే వీరి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.

సాక్షి, రాజమహేంద్రవరం: సంక్షేమ పథకాల అమలులో విఫలమైన కూటమి సర్కార్‌.. గత ప్రభుత్వ హయాంలో గాడిన పడిన పాలనను సైతం అస్తవ్యస్తం చేస్తోంది. సజావుగా నడుస్తున్న వ్యవస్థలను గందరగోళంలోకి నెడుతోంది. ఇప్పటికే ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేసిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్లో రేషనలైజేషన్‌ పేరుతో ఆందోళన నింపింది. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పేరును ఎన్టీఆర్‌ వైద్య సేవగా మార్చి బకాయిలు చెల్లించకుండా పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందకుండా ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ఈ క్రమంలోనే మరో అడుగు ముందుకు వేస్తూ విద్యా శాఖపై వికృత బుద్ధి ప్రదర్శిస్తోంది. హేతుబద్ధీకరణ పేరుతో స్కూల్‌ కాంప్లెక్స్‌ల స్థానంలో క్లస్టర్‌ వ్యవస్థ తీసుకుని వచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. గత ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్‌–117ను రద్దు చేసింది. రెండు వ్యవస్థలూ ఒకటే పని చేస్తున్నా.. తన మార్కు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా స్థానిక ఆనం కళాకేంద్రంలో అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు చెందిన ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయా జిల్లాల పరిధిలో చేపట్టాల్సిన మార్పులు, రద్దు చేయాల్సిన పాఠశాలలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి ఉపాధ్యాయ సంఘాల నేతలను దూరం పెట్టారు.

ఏం చేస్తున్నారంటే..

మెరుగైన విద్యాబోధన నిమిత్తం గత ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను కిలోమీటరు లోపు దూరంలో ఉన్న ప్రాథమికోన్నత, హైస్కూళ్లలో విలీనం చేసింది. ప్రస్తుతం ఈ విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయనుంది. దీనివలన ప్రాథమికోన్నత పాఠశాలలు వెనక్కు వెళ్లిపోతాయి. విద్యార్థులు చదువుకునేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి తలెత్తనుంది. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం.. గ్రామీణ ప్రాంతంలో 10 నుంచి 15, నగర పరిధిలో 8 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఒక స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలోకి తీసుకురానున్నారు. స్కూల్‌ కాంప్లెక్స్‌గా గుర్తించే ఉన్నత పాఠశాల వాటన్నింటికీ మధ్యలో ఉండాలి. ఒక్కో స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలో 40 నుంచి 50 మంది ఉపాధ్యాయులు, 800 నుంచి 1,000 మంది విద్యార్థులు ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక పంచాయతీ పరిధిలోని పాఠశాలలన్నింటినీ ఒకే స్కూల్‌ కాంప్లెక్స్‌గా తీసుకురావాలి తప్ప.. రెండుగా విభజించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో ప్రాథమికోన్నత (యూపీ) పాఠశాలలను స్కూల్‌ కాంప్లెక్స్‌ కేంద్రాలుగా కొనసాగించగా.. ప్రస్తుతం వాటిని రద్దు చేస్తున్నారు. ఉన్నత పాఠశాలను క్టస్టర్‌ కేంద్రంగా పరిగణిస్తారు.

డమ్మీలుగా ఎంఈఓలు

పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతల నుంచి మండల విద్యా శాఖ అధికారులను (ఎంఈఓ) తప్పించనున్నారు. వారిని పరిపాలనా పరమైన అంశాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. రోజువారీ విధులకు అదనంగా క్లస్టర్‌ స్కూలు ప్రధానోపాధ్యాయులపై క్లస్టర్‌ నిర్వహణ భారం పడనుంది. ఎంఈఓలు నిర్వర్తించే బాధ్యతలు సైతం క్లస్టర్‌ ప్రధానోపాధ్యాయులకే ఇవ్వాలని ప్రతిపాదించారు. పాఠశాలలు, ఉపాధ్యాయులపై అజమాయిషీ బాధ్యతను సంబంధిత క్లస్టర్‌ ప్రధానోపాధ్యాయులకు అప్పగించనున్నారు. ఉపాధ్యాయులకు శిక్షణలు, పాఠశాలల మధ్య విద్య అనుసంధానం, విద్యా వనరుల సామగ్రి తయారీ, తనిఖీలు, విద్యా వ్యవస్థ పర్యవేక్షణ కార్యకలాపాలను క్లస్టర్‌ కేంద్రంగా నిర్వహించనున్నారు. టీచర్ల పని తీరు, వేతనాలు, సెలవుల మంజూరు, ఇతర పాలనాపరమైన బాధ్యతలు సైతం ప్రధానోపాధ్యాయులే నిర్వర్తించాలి. ఇవన్నీ తలకు మించిన భారం కానుందని వారు ఆవేదన చెందుతున్నారు.

ఎంఈఓ–2 పోస్టుకు మంగళం

జిల్లా పరిషత్‌ ఉపాధ్యాయులను సైతం ఎంఈఓలుగా నియమించాలన్న సుదీర్ఘ డిమాండ్‌ను గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం సాకారం చేసింది. వారి అభ్యర్థన మేరకు గతంలో ఎంఈఓ–2 నియామకాలు చేపట్టింది. జెడ్పీ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులను ఆ పోస్టుకు ఎంపిక చేసింది. ఇప్పుడు ఈ పోస్టులను రద్దు చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా 19 ఎంఈఓ–2 పోస్టులు రద్దు కానున్నాయి. వారిని తిరిగి హెచ్‌ఎంలుగా నియమిస్తే 19 మంది స్కూల్‌ అసిస్టెంట్ల పదోన్నతులకు బ్రేక్‌ పడనుంది.

ప్లస్‌–2పై ‘పచ్చ’పాతం

గ్రామాల్లోని పేద విద్యార్థులు ఉన్న ఊళ్లోనే ఇంటర్‌ విద్య అభ్యసించాలనే తలంపుతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 15 ఇంటర్‌ బాలికల (ప్లస్‌–2) కళాశాలలు తీసుకువచ్చింది. పదో తరగతి పూర్తయిన వెంటనే అదే పాఠశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం వరకూ చదువుకునే ఏర్పాటు చేసింది. అందుకు అవసరమైన అన్ని వసతులూ కల్పించింది. తమ పిల్లలు ఇంటర్‌ చదివేందుకు ఉన్న ఊరు దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకపోవడంతో తల్లిదండ్రుల ఆలోచన ధోరణిలో కూడా మార్పు వచ్చింది. నాటి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో బాల్య వివాహాలు, పదో తరగతి పూర్తవగానే వివాహాలు చేసి అత్తారింటికి పంపే ప్రక్రియకు దాదాపు ఫుల్‌ స్టాప్‌ పడింది. ఇంత గొప్ప వ్యవస్థను రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో గత పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ప్లస్‌–2లో పని చేస్తున్న పీజీటీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇంటర్‌ చదివేందుకు తిరిగి దూర ప్రాంతాలకు వెళ్లాలేమోననే ఆందోళన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొంది.

జిల్లాలో పాఠశాలలు, విద్యార్థుల వివరాలు

ప్రభుత్వ పాఠశాలలు 985

ప్రాథమిక 711

ప్రాథమికోన్నత 72

ఉన్నత 183

హైస్కూల్‌ ప్లస్‌ 15

ప్రైవేటు 587

కేంద్ర ప్రభుత్వ పాఠశాల 1

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు 1.76 లక్షలు

ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు 1.52 లక్షలు

దేవరపల్లి: దేశంలోని హిందూ దేవాలయాల పరిరక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తూ జాతీయ ఉద్యమం చేపట్టినట్టు విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) ఉత్తరాంధ్ర ప్రధాన కార్య దర్శి, హైందవ శంఖారావం సభ కన్వీనర్‌ తనికెళ్ల సత్య రవికుమార్‌ తెలిపారు. దేవరపల్లిలో మంగళవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఈ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్‌లో హైందవ శంఖారావం ద్వారా శ్రీకారం చుట్టామని, ఇది దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ప్రారంభమవుతుందని చెప్పారు. హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం తగదని, వాటి నిర్వహణను హిందువులకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. దేశంలో హిందూ దేవాలయాలకు, అర్చకులకు భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాల వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. దేవాలయాల ఉద్యోగులు, దుకాణదారులు, కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్న అన్య మతస్తులను తొలగించాల ని డిమాండ్‌ చేశారు. హుండీల ఆదాయాన్ని ప్రజాపాలనకు ఖర్చు చేస్తున్నారని, దీనిని దేవాలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ ప్రచారానికే ఖర్చు చేయాలని అన్నారు. నిద్రావస్థలో ఉన్న హిందూ సమాజాన్ని మేల్కొల్పాల్సిన అవసరం ఉందన్నారు. దేవాలయా ల ద్వారా నిరంతర ధర్మ ప్రచారం జరగాలన్నారు. దేశంలోని హిందూ దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కలించేందుకు ప్రత్యేక చట్టం చేయాల్సిందిగా ఇటీవల విజయవాడ వచ్చిన కేంద్ర మంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తి చేశామని ఆయన తెలిపారు. దేవాలయాలను హిందువులకే అప్పగించే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని అమిత్‌షా చెప్పారన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ హిందూ దేవాలయాలకు విముక్తి కలిగే వరకూ తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు. ప్రతి దేవాలయంలో భక్తమండలి, గ్రామాల్లో విశ్వహిందూ పరిషత్‌ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దేవాలయాల పరిరక్షణకు హిందువులంతా ఉద్యమంలో పాల్గొనాలని రవికుమార్‌ కోరారు.

ఫ కూటమి సర్కార్‌ మార్కు

హేతుబద్ధీకరణ

ఫ స్కూల్‌ కాంప్లెక్స్‌ల స్థానంలో

క్లస్టర్‌ వ్యవస్థ

ఫ హెచ్‌ఎంలకు పర్యవేక్షణ బాధ్యతలు

ఫ ఎంఈఓలకు తగ్గనున్న ప్రాధాన్యం

ఫ ప్లస్‌–2 పాఠశాలల రద్దుకు నిర్ణయం

వీహెచ్‌పీ ఉత్తరాంధ్ర

ప్రధాన కార్యదర్శి సత్యరవికుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
దేవాలయాల పరిరక్షణకు జాతీయ ఉద్యమం1
1/2

దేవాలయాల పరిరక్షణకు జాతీయ ఉద్యమం

దేవాలయాల పరిరక్షణకు జాతీయ ఉద్యమం2
2/2

దేవాలయాల పరిరక్షణకు జాతీయ ఉద్యమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement