షర్మిల వ్యాఖ్యలు సరికావు
రాజమహేంద్రవరం రూరల్: స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం రూ.11,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం కంటితుడుపు చర్య అని పీసీసీ చీఫ్ షర్మిల అనడం సరికాదని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. రాజమహేంద్రవరంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. బాధ్యత కలిగిన రాజకీయ, కార్మిక నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేయరన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకే అనడం సబబు కాదని, ఇటువంటి వ్యాఖ్యలు మానుకోవాలని షర్మిలకు విజ్ఞప్తి చేశారు. కత్తిపూడి – ఒంగోలు ఆరు లేన్ల రహదారికి డీఆర్‌పీ రాగానే, పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కోటిపల్లి – నరసాపురం రైల్వే లైను పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.
బీజేపీ జిల్లా
అధ్యక్షుడిగా నాగేంద్ర
రాజమహేంద్రవరం సిటీ: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కొవ్వూరుకు చెందిన పిక్కి నాగేంద్రను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నియమించారు. ఈ మేరకు నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మంగళవారం ఉత్తర్వులు అందుకున్నారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, పూర్వ అధ్యక్షుడు బొమ్మల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
నూతన డీఎస్పీల
బాధ్యతల స్వీకరణ
రాజమహేంద్రవరం రూరల్/కంబాలచెరువు:
బదిలీల్లో భాగంగా వచ్చిన రాజమహేంద్రవరం నార్త్ జోన్, ఈస్ట్ జోన్ డీఎస్పీలు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నార్త్ జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్. ఈస్ట్ జోన్ డీఎస్పీ బి.విద్యలు తమ తమ కార్యాలయాలకు వచ్చి బాధ్యతలు స్వీకరించి విధుల్లో చేరారు. అనంతరం జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈస్ట్ జోన్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన విద్య 2022 గ్రూప్–1 బ్యాచ్‌కు చెందిన అధికారి. శిక్షణ అనంతరం తొలి పోస్టింగ్ ఇక్కడ పొందారు. ఇప్పటి వరకూ సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ ఈస్ట్ జోన్ ఇన్‌చార్జి డీఎస్పీగా వ్యవహరించారు. నూతన డీఎస్పీ విద్యను బొమ్మూరు ఇన్‌స్పెక్టర్ కాశీ విశ్వనాథ్, ఎస్సైలు అంకారావు, ప్రియకుమార్, సీహెచ్‌వీ రమేష్, అనపర్తి సీఐ సుమంత్, ఎస్సై ఎల్.శ్రీను, బిక్కవోలు ఎస్సై రవిచంద్రకుమార్, రంగంపేట ఎస్సై టి.కృష్ణసాయి మర్యాదపూర్వకంగా కలిశారు.
షర్మిల వ్యాఖ్యలు సరికావు
రాజమహేంద్రవరం రూరల్: స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం రూ.11,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం కంటితుడుపు చర్య అని పీసీసీ చీఫ్ షర్మిల అనడం సరికాదని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. రాజమహేంద్రవరంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. బాధ్యత కలిగిన రాజకీయ, కార్మిక నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేయరన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకే అనడం సబబు కాదని, ఇటువంటి వ్యాఖ్యలు మానుకోవాలని షర్మిలకు విజ్ఞప్తి చేశారు. కత్తిపూడి – ఒంగోలు ఆరు లేన్ల రహదారికి డీఆర్‌పీ రాగానే, పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కోటిపల్లి – నరసాపురం రైల్వే లైను పనులు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు
పాటించాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు సహకరించాలని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది మంగళవారం నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ నరసింహ కిశోర్ మాట్లాడుతూ, వాహనదార్ల రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. హెల్మెట్ ప్రాధాన్యాన్ని అందరూ తెలుసుకోవాలన్నారు. మద్యం తాగి, అతి వేగంగా, రాంగ్ రూట్‌లో, సెల్ ఫోన్ మాట్లాడుతూ, వాహనాలు నడపరాదని అన్నారు. ట్రిపుల్ రైడింగ్ తగదన్నారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను, విద్యార్థులను తరలించరాదన్నారు. రహదారి ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, తన కోసం కుటుంబం ఎదురు చూస్తుందనే విషయాన్ని జ్ఞప్తిలో ఉంచుకుంటూ, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు అల్లూరి వెంకట సుబ్బరాజు, ఎల్.అర్జున్, చెంచిరెడ్డి, స్పెషల్ బ్రాంచి (ఎస్‌బీ) డీఎస్‌పీ బి.రామకృష్ణ, ట్రాఫిక్ డీఎస్‌పీ ఎం.వెంకటేశ్వర్లు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ ఎ.శ్రీనివాసరావు, ఇతర డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment