ఏసీ మెకానిక్‌పై యువకుల దాడి
అమలాపురం టౌన్: ఓ ఏసీ మెకానిక్‌పై ఐదుగురు ఇంటర్ చదివిన యువకులు దాడి చేశారు. ఆదివారం రాత్రి స్థానిక బ్యాంక్ స్ట్రీట్‌లో ఈ ఘటన జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అంబాజీపేట మండలం పసుపల్లి గ్రామానికి చెందిన ఏసీ మెకానిక్ గంటి కిరణ్ ఏసీకి చెందిన ఓ పరికరాన్ని కొనుగోలు చేసేందుకు అమలాపురం పట్టణానికి వచ్చాడు. కొంత సమయం పడుతుందని షాపు నిర్వాహకులు తెలపడంతో సమీపంలో ఉన్న బజ్జీల బండి వద్దకు వెళ్లాడు. అక్కడే ఉన్న ఐదుగురు యువకులు ఏసీ మెకానిక్‌తో అకారణంగా గొడవ పడి దాడికి దిగారు. ముఖానికి గాయమైన కిరణ్ చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. మెడికో లీగల్ కేసుగా పరిగణించి అతనికి వైద్యులు చికిత్స చేశారు. దీనిపై బాధితుడు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏసీ మెకానికర్‌ను జిల్లా దళిత ఐక్య వేదిక కన్వీనర్ జంగా బాబూరావు, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు, వీసీకే పార్టీ కార్యదర్శి బొంతు రమణ, నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్‌చార్జి పొలమూరి మోహన్‌బాబుతో కూడిన బృందం సోమవారం సాయంత్రం పరామర్శించింది. ఏసీ మెకానిక్‌పై దాడి చేస్తున్నప్పుడు ఆ యువకుల్లో ఒకరు ‘నేను మంత్రి వాసంశెట్టి సుభాష్ రైట్ హ్యాండ్ కొడుకుని అంటూ దాడి చేశారని’ బాధితుడిని పరామర్శించిన దళిత నాయకులు వివరించారు. అకారణంగా దాడి చేసిన యువకులను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం నిందితులను స్థానిక పోలీస్ స్టేషన్‌కు పిలిపించి సీఐ వీరబాబు విచారించారు.
Comments
Please login to add a commentAdd a comment