ఖననం చేసిన వివాహిత మృతదేహానికి పోస్టుమార్టం
కొత్తపల్లి: ఖననం చేసిన వివాహిత మృతదేహానికి బుధవారం రెవెన్యూ, పోలీసు అధికారుల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. మూలపేటలోని ప్రకాష్ నగర్‌కు చెందిన గింజాల బాల (25), అదే గ్రామానికి చెందిన రాజపల్లి ప్రసాద్ ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ నెల 19న బాల మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని భర్త ప్రసాద్, అతని కుటుంబ సభ్యులు ఖననం చేశారు. కాగా.. బాల మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె తల్లి లక్ష్మి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మేరకు ఎస్సై వెంకటేష్ కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగా మూలపేట శ్మశాన వాటికలో ఖననం చేసిన బాల మృతదేహాన్ని బయటకు తీసి, ఎస్సై వెంకటేష్, తహశీల్దార్ చిన్నారావు పర్యవేక్షణలో ఫోరెన్సిన్ ల్యాబ్ ఇన్‌చార్జి ఉమామహేశ్వరరావు, సభ్యులు పోస్టుమార్టం నిర్వహించారు. సేకరించిన ఆధారాలను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment